- Home
- Entertainment
- నాగార్జునకి ఈ మూవీ వేస్ట్ అంటూనే..తన ముస్లిం ఫ్రెండ్ ని తీసుకెళ్లిన స్టార్ హీరో, ఏం జరిగిందో తెలుసా
నాగార్జునకి ఈ మూవీ వేస్ట్ అంటూనే..తన ముస్లిం ఫ్రెండ్ ని తీసుకెళ్లిన స్టార్ హీరో, ఏం జరిగిందో తెలుసా
కింగ్ నాగార్జున కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నమయ్య చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నాగార్జునతో అన్నమయ్య తీద్దామనుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించినట్లు రాఘవేంద్ర రావు పలు సందర్భాల్లో తెలిపారు.

కింగ్ నాగార్జున కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నమయ్య చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నాగార్జునతో అన్నమయ్య తీద్దామనుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించినట్లు రాఘవేంద్ర రావు పలు సందర్భాల్లో తెలిపారు. ఆ పాత్రకి నాగార్జున అయితేనే ఆకర్షణ ఉంటుంది అని రాఘవేంద్ర రావు బలంగా నమ్మారు.
అన్నమ్మయ్య చిత్రం విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఒక స్వీట్ మెమొరీ ఉందట. ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు తో కూర్చున్నప్పుడు ప్రభాస్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. నా కాలేజ్ డేస్ లో అన్నమయ్య చిత్రం రిలీజ్ అయింది. అందరూ సూపర్ హిట్ అంటున్నారు.
కానీ నాగార్జున అన్నమయ్య ఏంటి.. అస్సలు సింక్ కావట్లేదు.. వేస్ట్ అనుకున్నా. కానీ అంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు. సరే ఒకసారి వెళ్లి చూద్దాం అని అనుకున్నా. నాకు కాలేజ్ లో ఔరంగబత్కర్ అనే ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. వాడు తెలుగు సరిగ్గా మాట్లాడలేదు కానీ అర్థం చేసుకుంటాడు. వాడు నేను కలసి సినిమాకి వెళ్లాం.
నేనైతే సినిమాపై అసలు అంచనాలు పెట్టుకోలేదు. కానీ మూవీ చూస్తుంటే క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోయా. మైండ్ బ్లాక్, షాకింగ్ అన్ని ఒకేసారి అనిపించాయి. ఆ మూవీ చూసి నేనే ఒక ట్రాన్స్ లో ఉంటే.. నా ముస్లిం ఫ్రెండ్ నా కన్నా ఎక్కువ గోల మొదలు పెట్టాడు.
Nagarjuna
నాకు పిచ్చెక్కిపోయింది. నేను మళ్ళీ చూడాలి ఈ సినిమా. ఎప్పుడు వెళదాం అంటూ గోల మొదలు పెట్టాడు. ఎవరు ఈ సినిమా తీసింది అని అడిగాడు. నేను బిల్డప్ కోసం రాఘవేంద్ర రావు అని.. ఆయన మా నాన్నకి ఫ్రెండే లే అని చెప్పా. వాడికి సినిమాలో బాగా నచ్చేసింది.. వెంకటేశ్వర స్వామిని చూపించే విజువల్స్.. స్వామి రావడం.. ఆ మ్యూజిక్ వాడికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది.
ఆ విధంగా కాలేజ్ డేస్ లో అన్నమ్మయ్య చిత్రం ఒక స్వీట్ మెమొరిగా మిగిలింది అని ప్రభాస్ తెలిపాడు. రీసెంట్ గా ప్రభాస్ కూడా పౌరాణిక మొదలు పెట్టాడు. కల్కి చిత్రంలో ప్రభాస్ మహాభారతంలో ప్రముఖ వీరుడిగా నటించిన సంగతి తెలిసిందే.