టాలీవుడ్ 2024: పెద్ద ఫ్లాఫ్ లు ఇచ్చిన హీరోలు వీళ్లే
రవితేజ, గోపీచంద్, వరుణ్ తేజ్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు ఇలా రెండు భారీ డిజాస్టర్లను అందించారు. విశ్వక్ సేన్, రాజ్ తరుణ్, సుహాస్ ఈ ఏడాది మూడు డిజాస్టర్లు చవిచూశారు.
tollywood 2024, Venkatesh, Raviteja, Gopichand
తెలుగు చిత్ర పరిశ్రమకు 2024 అనేది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కానీ ఆరంభం, ముగింపు మాత్రం అదిరిపోయింది. సంక్రాంతి కి వచ్చిన హనుమాన్ చిత్రం రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. నార్త్ లోనూ ఈ సినిమా అదరకొట్టింది. అదే విధంగా ఏడాది చివర్లో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 చిత్రం వచ్చింది. ఈ సినిమా కు కలెక్షన్స్ ఓ రేంజిలో ఉన్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ని ఊపేస్తోంది. అలా మొదట, చివర నార్త్ ప్రేక్షకుల అండతో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కింది. అలాగే మధ్యలో వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా సైతం కొత్త మార్కెట్ ని క్రియేట్ చేసి అద్బుతమే జరిగింది. అయితే 2024 సంవత్సరం మాత్రం హీరోలుకు పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలో ఇప్పటికిదాకా తెలుగులో ఈ ఏడాదిలో వచ్చిన చిత్రాల్లో ఫ్లాఫ్ లు ఏ హీరోకు వచ్చాయో ఓ సారి చూద్దాం.
2024 స్టార్ హీరోలకు డిజాస్టర్స్ అందించినందున వారికి నిరాశా నామ సంవత్సరమనే చెప్పాలి. మొదటగా సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్‌లో వచ్చి డిజాస్టర్ ఇచ్చారు. ఆయన ఎంతో నమ్మి కమల్ హాసన్ విక్రమ్ మాదిరిగా ఉండాలని చేసిన సైంధవ్ చిత్రాన్ని ప్రేక్షకులు తీవ్రంగా తిరస్కరించారు.
అలాగే రవితేజ, గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నిఖిల్, రామ్, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ వంటి హీరోలు ఈ ఏడాది ఫ్లాప్‌లను అందించారు. రవితేజ, గోపీచంద్, వరుణ్ తేజ్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు ఇలా రెండు భారీ డిజాస్టర్లను అందించారు. విశ్వక్ సేన్, రాజ్ తరుణ్, సుహాస్ ఈ ఏడాది మూడు డిజాస్టర్లు చవిచూశారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్, అఖిల్, నాగ చైతన్య, మంచు విష్ణు చిత్రాలు 2024లో అసలు విడుదలే కాలేదు.
2024లో ఫ్లాఫ్ లు ఇచ్చిన హీరోలు వారి సినిమాలు:
వెంకటేష్ (సైంధవ్)
రవితేజ (ఈగిల్, మిస్టర్ బచ్చన్)
గోపీచంద్ (భీమా , విశ్వం)
శర్వానంద్ (మనమే)
వరుణ్ తేజ్ (ఆపరేషన్ వాలెంటైన్, మట్కా)
విజయ్ దేవరకొండ (ఫ్యామిలీ స్టార్)
అల్లరి నరేష్ (ఆ ఒక్కటి అడక్కు)
నిఖిల్ (అప్పుడో ఇప్పుడో ఎప్పుడో)
రామ్ (డబుల్ ఐస్మార్ట్)
విశ్వక్ సేన్ (గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , మెకానిక్ రాకీ)
శ్రీ విష్ణు (ఓం భీమ్ బుష్ , స్వాగ్)
సుహాస్ (ప్రసన్న వదనం, జనక అయితే గనక, గొర్రె పురాణం)
నారా రోహిత్ (ప్రతినిధి 2)
కార్తికేయ (భజే వాయు వేగం)
ఆనంద్ దేవరకొండ (గం గం గణేశ)
సుధీర్ బాబు (హరోమ్ హర, మా నాన్న సూపర్ హీరో)
నవదీప్ (లవ్ మౌళి)
ప్రియదర్శి (డార్లింగ్)
రాజ్ తరుణ్ (పురుషోత్తముడు, తిరగబడరా సామి , భలే ఉన్నాడే)
అల్లు శిరీష్ (బడ్డీ)
అశోక్ గల్లా (దేవకీ నందన వాసుదేవ)