బడా నిర్మాత కోడలు కాబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కోరి కోడల్ని చేసుకుంటున్నారట..?
ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు.. పెళ్లి రూమర్స్ ఎక్కువై పోయాయి. కాస్త లింక్ దొరికితే చాలు... డొంకంతా కదిలిస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఇక ఆమధ్య వర్షిణి, అనన్య, పెళ్లి రూమర్స్ గట్టిగా వినిపించాయి... ఇక ఇప్పుడు యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్ల కూతురు కాబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ల లిస్ట్ లో వర్ష బొల్లమ్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది. చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వర్ష అంతకు ముందు తమిళంలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది.
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ల లిస్ట్ లో వర్ష బొల్లమ్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది. చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వర్ష అంతకు ముందు తమిళంలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది.
దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో హీరోగా తెరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీ మూవీ తరువాత వర్షకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా దక్కింది. ఇక ఆతరువాత ఆనందోదేవకొండతోనే పుష్పక విమానం సినిమా చేసింది వర్ష.
ఇక రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ జోడీగా స్వాతిముత్యం సినిమాలో నటించి మెప్పించింది వర్ష బొల్లమ్మ. ఈ సినిమాతో మరో హిట్ కొట్టింది. ఇక అసలు విషయం ఏంటీ అంటే..? వర్ష బొల్లమ్మ పెళ్లి పీటలెక్కబోతుదంట. అది కూడా ఇండస్ట్రీలో ఓ బడా ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళబోతున్నట్టు తెలస్తోంది.
వర్ష చాలా అందంగా ఉంటుంది. ఆమె అభినయం కూడా చాలా చక్కగా ఉంటుంది. స్క్రీన్ పై వర్షను చూసిన ఓ స్టార్ మాజీ ప్రొడ్యూసర్.. ఆమెను తన కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయించాడట. అతని కొడుకు కూడా వర్ష అందానికి, ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాడట.
అంతే కాదు వర్ష ఫ్యామిలీతో కూడా మాట్లాడటం జరిగిపోయిందట. ఈ ఏడాదే నిశ్చితార్దం చేసుకుని నెక్ట్స్ ఇయర్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈలోపు వర్ష కూడా తను కమిట్ అయిన సినిమాలు కంప్లీల్ చేసుకుని ఫ్రీ అవ్వాలని చూస్తుందట. మొత్తానికి ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఓ పెద్దింటి కోడలు కాబోతుంది.
ప్రస్తుంతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాని అఫీషియల్ గా మాత్రం ఇరు వర్గాల నుంచి అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.