భయపడకుండా కాశ్మీర్ లో అడుగుపెడితే బంపర్ హిట్టే!
First Published Aug 15, 2019, 5:22 PM IST
80, 90 దశకాల వరకు తెలుగు సినిమాని ఫారెన్ లో షూట్ చేసే అలవాటు లేదు. అప్పటి దర్శక నిర్మాతలకు సాంగ్స్ షూట్ చేయడానికి ఊటీ, కశ్మీర్ లాంటి ప్రాంతాలే కనిపించేవి. 1995 తర్వాత కశ్మీర్ లో సినిమాలు షూట్ చేయడం బాగా తగ్గింది. కశ్మీర్ అందాలలో చిత్రీకరణ జరుపుకున్న అప్పటి తెలుగు చిత్రాలు ఇవే!

అల్లావుద్దీన్ అద్భుత దీపం: కశ్మీర్ లో తొలిసారి షూటింగ్ జరుపుకున్న తెలుగుసినిమా ఘనత ఏఎన్నార్ కే దక్కుతుంది. 1957లో తెరకెక్కిన అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రాన్ని కశ్మీర్ లో కొంత భాగం చిత్రీకరించారు.

శ్రీవారి ముచ్చట్లు: అల్లావుద్దీన్ అద్భుత దీపం తర్వాత మరికొన్ని ఏఎన్నార్ చిత్రాలు కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. వాటిలో ప్రధానమైనది శ్రీవారి ముచ్చట్లు చిత్రం. ఈ చిత్రంలో ఏఎన్నార్ సరసన జయప్రద, జయసుధ నటించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?