- Home
- Entertainment
- ANR Wife:పెళ్ళైన కొత్తలో ఏఎన్నార్ భార్య కోరిన చిన్న కోరిక, భర్త ముందే అసభ్యంగా అవమానించడంతో ఏం చేశారంటే
ANR Wife:పెళ్ళైన కొత్తలో ఏఎన్నార్ భార్య కోరిన చిన్న కోరిక, భర్త ముందే అసభ్యంగా అవమానించడంతో ఏం చేశారంటే
పెళ్ళైన కొత్తలో తనకి, తన భార్యకి దారుణమైన అవమానం జరిగింది అని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ అవమానంతో ఏఎన్నార్ సతీమణి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Akkineni Nageswara Rao
అక్కినేని నాగేశ్వరరావు బాల్యం నుంచే నాటకాలు వేయడం ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ లని ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అభివర్ణిస్తుంటారు. ఎన్టీఆర్ కంటే ముందుగానే ఏఎన్నార్ ఇండస్ట్రీకి వచ్చారు. పాపులారిటీ సాధించారు. నటీనటులకు క్రేజ్ వస్తుంది కానీ వారి ఫ్యామిలీల పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పాపులారిటీ వల్ల వచ్చే విమర్శలు, అవమానాలు సైతం దిగమింగాల్సి ఉంటుంది. నటుడి కుటుంబ సభ్యులు ఎంతో సహనంతో, లౌక్యంతో వ్యవహరించాలి. లేకపోతే కష్టం. ఆ విషయంలో నాకు గొప్ప భార్య దొరికింది అని ఏఎన్నార్ తన సతీమణి అన్నపూర్ణ గురించి తెలిపారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు.
తమిళంలో కూడా పాపులారిటీ
ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య అన్నపూర్ణకి ఎదురైన ఘోర అవమానం గురించి మాట్లాడారు. 'నాకు 1949లో వివాహం జరిగింది. అప్పటికే నేను నటించిన కీలుగుర్రం, లైలా మజ్ను లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలు తమిళంలో కూడా డబ్ అయి రిలీజ్ అయ్యాయి. అక్కడ కూడా హిట్ అయ్యాయి. అప్పటికి తెలుగుతో పాటు తమిళంలో కూడా నేనే స్టార్ ని. శివాజీ గణేష్, జెమినీ గణేశన్ లాంటి వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపట్టేవారు.
ఏఎన్నార్ భార్యకి దారుణమైన అవమానం
పెళ్ళైన కొత్తలో నా భార్య ఇంగ్లీష్ పిక్చర్ చూడాలని ఉంది, తీసుకువెళ్ళండి అని కోరింది. దీనితో చెన్నైలో ఓ థియేటర్ లో సినిమాకి వెళ్లాం. నేను కనిపించగానే బాల్కనీలో ఉన్న వాళ్లంతా పైకి లేచారు. ఎవరో కొత్త పిల్లని పట్టుకుని వచ్చాడే వీడు.. ఆమె ఎవరు ? భానుమతా ? లేదు ఆమె లావుగా ఉంటుంది కదా.. లేకపోతే అంజలినా ? కాదు ఆమె పొట్టిగా ఉంటుంది కదా.. ఎక్కడో కొత్త పిల్లని పట్టుకుని వచ్చాడులే అంటూ చాలా అసభ్యంగా కామెంట్స్ చేయడం నాకు వినిపించింది. నా భార్య కూడా వారి మాటలు వింటూనే ఉంది. అంటే ఒక నటుడి పక్కన ఏ అమ్మాయి కనిపించినా వేశ్య తరహాలోనే చూసేవాళ్ళు. ఆ సంఘటన తర్వాత నా భార్య ఇంకెప్పుడూ బయటకి వచ్చి సినిమా చూడలేదు.
తన భార్యపై ఏఎన్నార్ ప్రశంసలు
నేను సొంతంగా స్టూడియో, థియేటర్ కట్టిన తర్వాతే అక్కడ సినిమా చూసింది అని ఏఎన్నార్ తన భార్య గురించి తెలిపారు. పాపులారిటీ వల్ల నటుడి భార్య, చెల్లెళ్లకి కూడా ఇబ్బందులు ఉంటాయి. నటుడి భార్య కావడానికి కూడా చాలా ధైర్య సాహసాలు, తెలివితేటలు, ఓర్పు కావాలి. ఆ లక్షణాలన్నీ నా భార్యలో ఉన్నాయి అని ఏఎన్నార్ ప్రశంసలు కురిపించారు.
ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా అవమానాలు
ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా తనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఏఎన్నార్ అన్నారు. ఆ తర్వాత పట్టుదలతో, కసితో ఇంగ్లీష్ నేర్చుకున్నానని ఏఎన్నార్ తెలిపారు.