10 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో.. వయస్సు పెరుగుతున్నా హాట్ నెస్ తగ్గని ముదురు భామలు
హీరోయిన్లు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమే. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఇలా వచ్చి అలా వెళుతుంటారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పదేళ్లకు పైగా కొనసాగడం అంటే మాటలు కాదు. అలా దశాబ్దానికిపైగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ చెక్కు చెదరని అందంతో ఉన్న హీరోయిన్లు ఉన్నారు. ఆ హీరోయిన్ల వివరాలు చూద్దాం.

త్రిష: 2003 నుంచి త్రిష తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అయితే స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం త్రిష వయసు 38 ఏళ్ళు. అయినా కుర్రాళ్ళ కళ్ళు చెదిరే ఫిట్ నెస్, అందంతో త్రిష ఆకట్టుకుంటోంది.
నయనతార : నయనతార కాలంలో వెనక్కి ప్రయాణిస్తుందా అని అనుమానం రావడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ నయన్ మరీ యంగ్ గా మారిపోతోంది. సౌత్ లో నయనతార లేడీ సూపర్ స్టార్ . నయనతార సీనియర్ హీరోల సరసన ఒదిగిపోగలదు. అలాగే కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ చేయగలదు. ఇటీవల నయన్ లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.
శ్రీయ శరన్ : టాలీవుడ్ లో శ్రీయ కూడా దశాబ్దానికి పైగా నటిగా కొనసాగుతోంది. ఒకప్పుడు శ్రీయ తన నాజూకు అందాలతో తెలుగు యువత మతి పోగొట్టింది. ప్రస్తుతం శ్రీయ ఓ పాపకు తల్లి కూడా. అయినప్పటికీ శ్రీయ నాజూకు అందాల వేడి తగ్గలేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తోంది.
అనుష్క శెట్టి: అనుష్క టాలీవుడ్ లో సూపర్ చిత్రంతో అడుగు పెట్టింది. తొలి చిత్రంలోనే తన అందాల ఘాటు ప్రదర్శించింది ఈ బ్యూటీ. అలాగే వరుస సక్సెస్ కు కూడా ఎదురు కావడంతో అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాహుబలి చిత్రంతో అనుష్క క్రేజ్ పీక్స్ కి చేరింది. కాస్త బొద్దుగా మారినప్పటికీ వన్నె తరగని అందం అనుష్క సొంతం.
కాజల్ : కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి అని అందరికి తెలిసిందే. గ్లామర్ పరంగా కాజల్ కి సాటిలేదు అనే చెప్పాలి.
ఇలియానా : గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ కు వెళ్లడంతో అక్కడ ఇలియానాకు కలసి రాలేదు. ఇలియానా కూడా దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇలియానా గ్లామర్ కి ఇప్పటికి అభిమానులు ఉన్నారు.
తమన్నా: టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
హన్సిక : డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. టీనేజ్ లోనే హన్సిక హీరోయిన్ గా మారింది. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికీ హన్సిక వరుస చిత్రాల్లో నటిస్తోంది.