ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సురేఖా వాణి.. భర్తను గుర్తు చేసుకున్న సీనియర్ నటి
టాలీవుడ్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గతంలో ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఎలా ఉంటున్నారు.. ఆమె సందడి అంతా తెలిసిందే. ఇక తాజాగా ఆమో పెట్టిన ఎమోషనల్ ఫోస్ట్ వైరల్ అవుతుంది. అసలు సంగతేంటోం చూద్దాం.

తెలుగు ప్రేక్షకులకు సురేఖా వాణి అంటే పరిచయం అవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.సినిమాలు బాగా చూసేవారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి హాట్ హాట్ ఫోటోలతో పరిచయమే. ప్రస్తుతం సినిమాలకంటే సోషల్ మీడియాలోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. స్టార్ కమెడియన్ల సరసన భార్యగా నటించి ప్రేక్షకులను అలరించింది.
ఇక కెరీర్ ను బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖా వాణీ.. డైరెక్టర్ సురేష్ తేజ ని లవ్ మ్యారుజ్ చేసుకుంది. భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ ప్రోగ్నామ్ కు యాంకర్ గా బాగా పేరు సంపాదించింది. 2005 సంవత్సరంలో శీనుగాడు సినిమాతో మూవీ కెరీర్ ను స్టార్ట్ చేసి సురేఖా వాణి.. హీరోలకు... హీరోయినలకు అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది.
ఇక కొంత కాలం క్రితం సురేఖా భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించాడు. దాంతో చాలా కాలం డిఫ్రెషన్ కు గురై.. బయటకు రాలేదు సురేఖా. తాంతో ఆమెకు రావల్సిన అవకాశాలు కూడా చేజారి పోయాయి. ఇఫ్పుడు కూడా సినిమాలు చేస్తుంది కాని.. అప్పటంత ఊపులో మాత్రం లేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం తన కూతురుతో కలిసి హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. హీరోయిన్లను మించి చూపిస్తోంది.
ఇక రీసెంట్ గా ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన భర్తను గుర్తు చేసుకుంటూ... సురేఖా వాణీ పోస్ట్ పెట్టింది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్తను తల్చుకొని ఎమోషనల్ పోస్ట్ ఇన్ స్ట్రాలో షేర్ చేసింది సురేఖా వాణీ. నా కళ్లలో ఆనందం, సంతోషం కన్నా.. నువు నా పక్కన లేవు అన్న బాధ నన్ను ఎక్కువగా ఆవేదనకు గురి చేస్తుంది.. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ నాతోటే ఉంటాయని నాకు తెలుసు.. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే సందడి.. ఆ మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.నిన్న చాలా మిస్ అవుతున్నా.. లవ్ యూ ఫర్ ఎవర్’ అంటూ ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. భర్త ఫోటో ముందు కేక్ కూడా కట్ చేసింది సురేఖా వాణి.. మరియూ తమ గారాల కూతురు కూడా ఈ ఫోటోలో కనిపించింది.