- Home
- Entertainment
- Ritu Varma : తెలుగు హీరోయిన్ ట్రెండీ లుక్... రీతూ వర్మను ఇలా చూస్తే అలా అనిపిస్తోందంట.!
Ritu Varma : తెలుగు హీరోయిన్ ట్రెండీ లుక్... రీతూ వర్మను ఇలా చూస్తే అలా అనిపిస్తోందంట.!
తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు పద్ధతిగా మెరిసే ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్స్ లో మెరియడంతో ఫ్యాన్స్ ఇలా కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో సందడి చేస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది.
చివరిగా ఈ బ్యూటీ ‘మార్క్ ఆంటోనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుంది. నెక్ట్స్ చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchatharam) చిత్రంతో అలరించబోతోంది.
కానీ, ఆ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ షాక్ కు గురిచేస్తోంది. ఏదేమైనా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం రీతూ వర్మ నటించిన చిత్రం రిలీజ్ కావాల్సినది ఇదొక్కటే ఉంది.
నెక్ట్స్ మరిన్ని ఆఫర్ల కోసం రీతూ వర్మ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తూ రీతూ వర్మ లుక్ పై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్లు...
ట్రెండీ లుక్ లో రీతూ వర్మ.. చాలా మంది హీరోయిన్ల కంటే వెయ్యి రెట్లు అందంగా ఉందని పొగుడుతున్నారు. ఆమె అందాన్నిచూసి మురిసిపోతున్నారు. లైక్స్ తో మరింతగా వైరల్ చేస్తున్నారు.