Priyamani : ప్రియమణి చెప్పింది ఒకటి... చేస్తున్నది మరొకటి... ఇలాగైతే ఆమె కోరిక తీరేనా?
సీనియర్ నటి ప్రియమణి (Priyamani) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. మరీ యంగ్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది. దీంతో నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ లో నటి ప్రియమణి (Actress Priyamani)కి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించి మెప్పింది. తన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘యమదొంగ’, ‘నవ వసంతం’, ‘ద్రోణ’, ‘గోలీమార్’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇక అటు తమిళం, మలయాళం, హిందీలోనూ వరుస పెట్టి సినిమాలు చేసింది.
ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మెయిన్ లీడ్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ తో నటిస్తూ వస్తోంది. కీలక పాత్రలు, విభిన్నమైన రోల్స్ లో అలరిస్తూ వస్తోంది.
జవాన్, నీరు, వంటి సినిమాలతో రీసెంట్ గానే ఆకట్టుకుంది. ఇకలేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అదరగొడుతోంది. ‘భామా కలాపం 2’ (Bhama kalapam 2) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక రేపు తను హిందీలో నటించిన ‘ఆర్టికల్ 370’ Article 360 సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ తోనే ప్రియమణి బిజీగా ఉన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. మరోవైపు తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది.
తాజాగా సీనియర్ భామ పిచ్చెక్కించేలా ఫొటోషూట్ చేసింది. ట్రెండీ వేర్స్ లో మతులు పోగొట్టింది. మరీ యంగ్ లుక్ లో దర్శమనిచ్చింది. తనదైన ఫోజులతో కట్టిపడేసింది. ప్రస్తుతం ప్రియమణి లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది.
40 ఏళ్ల వయస్సులోనూ ప్రియమణి మరి ఇంత యంగ్ గా కనిపిస్తుండటంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఓవైపు విలన్ రోల్స్ చేయాలంటూనే.. ఇంత అందంగా మెరుస్తుంటే ఆమె కోరిక నెరవేరుతుందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.