సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో, వధువు ఎవరో తెలుసా?
ఈమధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలందరు వరుసగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. దాంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈక్రమంలో మరో యంగ్ హీరో తాజాగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు.

టాలీవుడ్ యువ నటుడు విశ్వంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే యువతి మెడలో మూడు ముళ్లు వేసి, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ జంట అత్యంత సింపుల్‌గా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించగా, పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వంత్, సామర్లకోటలో పుట్టి పెరిగారు. ఆయన కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్ మిడిల్‌లోనే సినిమాపై ఆసక్తి పెరిగిన విశ్వంత్, చదువును విడిచిపెట్టి నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆతరువాత తన చదువును పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విశ్వాంత్ కు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన ‘కేరింత’ సినిమాలో సెకండ్ హీరోగా నటించి సినిమాల్లోకి ప్రవేశించారు.
తొలి చిత్రం ‘కేరింత’ ప్రేక్షకుల మన్ననలు పొందటంతో విశ్వంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో పాటు అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత వరుసగా విశ్వంత్ ‘ఓ పిట్ట కథ’, ‘జెర్సీ’, ‘హైడ్ అండ్ సీక్’, ‘కథ వెనక కథ’, ‘తోలుబొమ్మలాట’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’, ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘మ్యాచ్ ఫిక్సింగ్’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన స్థాయిని పెంచుకుంటూ కొనసాగారు.
ఇప్పుడు భావనను వివాహం చేసుకున్న విశ్వంత్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. పెళ్లి అనంతరం ఈ క్యూట్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు వారి పెళ్లి ఫొటోలపై స్పందిస్తూ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. కొత్త జీవితం ఆనందంగా సాగాలని, సినీ రంగంలో మరింత విజయాలు అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.