Tiger 3 Review: `టైగర్ 3` ప్రీమియర్ టాక్.. సల్మాన్ ఇలా చేశాడేంటి.. ఆడియెన్స్ ఏమంటున్నారంటే?
సల్మాన్ ఖాన్ కి సక్సెస్ పడి చాలా రోజులవుతుంది. సక్సెస్ కోసం తన హిట్ ఫ్రాంఛైజీ అయిన `టైగర్`కి రెండో సీక్వెల్ `టైగర్3`తో వస్తున్నారు. ఆదివారం ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ టాక్ ఎలా ఉంది, ట్విట్టర్‌లో ఆడియెన్స్ ఏమంటున్నారో చూద్దాం.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి గత ఆరేళ్లుగా హిట్ లేదు. చివరగా ఆయన `టైగర్ జిందా హై` చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన నాలుగు సినిమాలు చేశారు. ఈనాలుగూ పరాజయాలు చవిచూశాయి. `దబాంగ్ 3` సైతం డిజప్పాయింట్ చేసింది. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన `టైగర్` సిరీస్‌ని నమ్ముకున్నాడు. అందులో రెండో సీక్వెల్ `టైగర్3` చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.
కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ చేశారు. దీపావళి పండగ సందర్భంగా నేడు ఆదివారం(నవంబర్ 12)న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మరి ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమాకి ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ఆడియెన్స్ ట్విట్టర్‌లో ఏం చెబుతున్నారు? సల్మాన్ కి హిట్ పడిందా? మళ్లీ నిరాశే ఎదురైందా? అనేది తెలుసుకుందాం.
`టైగర్ 3` కథగా చూస్తే, టైగర్ సల్మాన్ ఖాన్ రా ఏజెంట్, ఆయన వైఫ్ జోయా(కత్రినా కైఫా్) టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇండియాలో భారీ బ్లాస్టింగ్‌కి ప్లాన్ చేసిన ఆతిష్(ఇమ్రాన్ హష్మీ)ని అడ్డుకునేందుకు కలిసి పనిచేయడమనేది ఈ మూవీ కథ. మరి ఏం చేశారు? ఎలా కట్టడి చేశారు? సక్సెస్ అయ్యారా? లేదా అనేది సినిమా కథ. కథగా ఇది గత చిత్రాల లైన్‌లోనే ఉంది.ఆ విషయంలో కొత్తదనం ఏం లేదనిపిస్తుంది. అయితే దాన్ని తెరకెక్కించిన తీరు, స్క్రీన్‌ప్లేని నడిపించిన తీరు ఇందులో ముఖ్యం ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడా? లేదా అనేదే ఇందులో మెయిన్ పాయింట్.
ఆ విషయానికి వస్తే `టైగర్ 3` ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే డిజాప్పాయింట్ టాక్ వస్తుంది. ఇటీవల వచ్చిన `జవాన్`, `పఠాన్`తో పోల్చుతూ ఆయా సినిమాల స్థాయిలో లేదంటున్నారు. గతుకుల రోడ్డులా సినిమా సాగిందంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి కొంత డ్రామా, యాక్షన్ ఎపిసోడ్లతో సాగిందట. యాక్షన్ సీన్లు మాత్రం బాగానే ఉన్నాయని, అలాగని గొప్పగా లేవంటున్నారు. యావరేజ్ ఫస్టాఫ్‌గా చెబుతున్నారు.
ఇక సెకండాఫ్‌లో షారూఖ్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయిందట. వీరిద్దరపై యాక్షన్ బ్లాక్ నెక్ట్స్ లెవల్‌లో ఉందని, ఆయా సీన్లలో ఇద్దరు హీరోలను చూస్తే ఫ్యాన్స్ కి అదొక ఫీస్ట్ లా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఫస్టాఫ్ రేంజ్‌లో సెకండాఫ్ లేదట. అంతేకాదు స్పై మూవీస్‌లో ఉండాల్సిన యాక్షన్ బ్లాక్స్, సస్పెన్స్, రేసీగా సాగడం వంటివి, అలాగే విజువల్స్ వాహ్ అనేలా లేవని చెబుతున్నారు. షారూఖ్ గెస్ట్ అప్పీయరెన్స్ రేంజ్‌లో సినిమా లేదని అంటున్నారు.
చాలా వరకు నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. సినిమా ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. కథలో బలం లేదని, చాలా సీన్లు రియలిస్టిక్‌గా లేవని, హీరోయిన్ టవల్ ఫైట్ సీన్లు చాలా కామెడీగా ఉన్నాయని, ఏమాత్రం రియలిస్టిక్ లేదని అంటున్నారు. షారూఖ్ గెస్ట్ రోల్ తప్ప సినిమాలో ఏం లేదని అంటున్నారు. ఫస్టాఫ్ చాలా స్లోగా సాగుతుందట. సెకండాఫ్ బోరింగ్‌గా ఉందని, దీంతో ఇదొక యావరేజ్ మూవీగా చెబుతున్నారు.
అదే సమయంలో ఫ్యాన్స్ నుంచి మాత్రం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా అదిరిపోయిందని, స్పై మూవీస్‌లో బెస్ట్ మూవీ అని, బెస్ట్ యాక్షన్ మూవీ అంటున్నారు. సల్మాన్ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ పాయింట్, యాక్షన్ సీన్లు, బీజీఎం, ఇమ్రాన్ హష్మీ రోల్ సైతం అదిరిపోయాయని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. `పఠాన్`కంటే చాలా బెటర్‌గా ఉందని అంటున్నారు. ఇలా రెండు భిన్నమైన అభిప్రాయాలు స్పష్టంగా వస్తున్నాయి. మరి వాస్తవంగా సినిమా ఎలా ఉందనేది `ఏషియా నెట్` రివ్యూలో తెలుసుకుందాం.