MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. ప్రభాస్‌, రవితేజ మధ్య గట్టి పోటీ

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. ప్రభాస్‌, రవితేజ మధ్య గట్టి పోటీ

This Week Theatre Movies: ఈ వారం థియేటర్లోకి మూడు సినిమాలు రాబోతున్నాయి. అందులో `బాహుబలిః ది ఎపిక్‌`, అలాగే మాస్‌ మహారాజా రవితేజ నటించిన `మాస్‌ జాతర` పోటీ పడబోతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 27 2025, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు
Image Credit : Asianet News

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు

అక్టోబర్‌ నెలాఖరుకి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒక ఇండియన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ ఉండటం విశేషం. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలిః ది ఎపిక్‌` ఈ వారమే విడుదల కానుంది. దీంతోపాటు మాస్‌ మహారాజా నటించిన `మాస్‌ జాతర` సైతం విడుదలవుతుంది. ఈ రెండు చిత్రాలు ఈ నెలాఖరులో వినోదాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని తీసుకురాబోతున్నాయి. వీటితోపాటు ఓ తమిళ మూవీ కూడా రిలీజ్‌ కానుంది. అయితే ఈ వారం రవితేజ, ప్రభాస్‌ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఓ రకంగా మాస్‌ మహారాజాని డార్లింగ్‌ దెబ్బకొట్టేలా ఉన్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాహుబలి రెండు పార్ట్ లు కలిపి `బాహుబలిః ది ఎపిక్‌`గా విడుదల
Image Credit : Asianet News

బాహుబలి రెండు పార్ట్ లు కలిపి `బాహుబలిః ది ఎపిక్‌`గా విడుదల

ఈ నెల 31న(శుక్రవారం) విడుదల కాబోతున్న సినిమాల్లో `బాహుబలిః ది ఎపిక్‌` ఉంది. బాహుబలి రెండు పార్ట్ లను కలిపి దీన్ని రూపొందించారు. `బాహుబలిః ది బిగినింగ్‌`, `బాహుబలిః ది కన్‌ క్లూజన్‌` చిత్రాలను ఒక్కటిగా మెర్జ్ చేశారు దర్శకుడు రాజమౌళి. దీంతో ఇది మూడు గంటల 44 నిమిషాలు వచ్చింది. ఇంతటి భారీ నిడివితో సినిమా రావడం ఇటీవల ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. యాడ్స్ తో కలిసి ఇది దాదాపు నాలుగు గంటలు ఉండబోతుంది. ఇక ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, అడవిశేషు వంటి వారు నటించిన విషయం తెలిసిందే. `బాహుబలి 2` ఏకంగా రూ.1800కోట్ల కలెక్షన్లని రాబట్టి ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ రెండు పార్ట్ లను కలిపి ఒక్క మూవీగా విడుదల చేస్తుండటంతో, దీనిపై క్యూరియాసిటీ నెలకొంది. సినిమా బాగా ఆడితే ఇది `దంగల్` రికార్డులను బ్రేక్‌ చేయబోతుందని చెప్పొచ్చు. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

Related image1
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
Related image2
ఆ విషయంలో ఎన్టీఆర్‌కి భార్య ప్రణతి వార్నింగ్‌.. ఇంటి రహస్యం బయటపెట్టిన రాజమౌళి
34
మాస్‌ జాతరతో రాబోతున్న రవితేజ
Image Credit : Asianet News

మాస్‌ జాతరతో రాబోతున్న రవితేజ

ఇక శుక్రవారమే(అక్టోబర్‌ 31న) మాస్‌ మహారాజా రవితేజ నటించిన `మాస్‌ జాతర` విడుదల కానుంది. భాను బోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. `ధమాఖా` తర్వాత మరోసారి ఈ జంట నటించారు. `ధమాఖా` తర్వాత రవితేజకి హిట్‌ పడలేదు. ఆ హిట్‌ని ఈ మూవీతో రిపీట్‌ చేయబోతున్నారనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇది పూర్తి మాస్‌, కమర్షియల్‌ మూవీగా రాబోతుందని టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. నేడు(సోమవారం) మధ్యాహ్నం ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంపై మంచి బజ్‌ ఉంది. ట్రైలర్‌తో ఆ బజ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ప్రధానంగా ఈ శుక్రవారం `బాహుబలిః ది ఎపిక్‌`, `మాస్‌ జాతర` మధ్య పోటీ ఉండబోతుంది. అయితే రవితేజని ప్రభాస్‌ దెబ్బకొడతాడా? అనేది చూడాలి.

44
తమిళ డబ్బింగ్‌ మూవీ `ఆర్యన్‌`
Image Credit : Asianet News

తమిళ డబ్బింగ్‌ మూవీ `ఆర్యన్‌`

ఇక ఇదే రోజు రాబోతున్న మరో మూవీ `ఆర్యన్`. తమిళంలో రూపొందిన చిత్రమిది. విష్ణు విశాల్‌ హీరోగా నటించారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్‌, మానస చౌదరీ హీరోయిన్లుగా నటించారు. విష్ణు విశాల్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న తమిళంతోపాటు తెలుగులో విడుదల కాబోతుంది. సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
Recommended image2
ఆ విషయంలో ఎన్టీఆర్‌కి భార్య ప్రణతి వార్నింగ్‌.. ఇంటి రహస్యం బయటపెట్టిన రాజమౌళి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved