MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో ఎన్టీఆర్‌కి భార్య ప్రణతి వార్నింగ్‌.. ఇంటి రహస్యం బయటపెట్టిన రాజమౌళి

ఆ విషయంలో ఎన్టీఆర్‌కి భార్య ప్రణతి వార్నింగ్‌.. ఇంటి రహస్యం బయటపెట్టిన రాజమౌళి

ఎన్టీఆర్‌ కి సంబంధించి వీక్‌నెస్‌లను రాజమౌళి చాలా సార్లు బయటపెట్టారు. ఓపెన్ గానే కామెంట్‌ చేశారు. అందులో భాగంగా తారక్‌కి ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఇచ్చిన వార్నింగ్‌ని కూడా వెల్లడించారు రాజమౌళి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 26 2025, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్‌ విషయంలో రాజమౌళి కంప్లెయింట్‌
Image Credit : our own

ఎన్టీఆర్‌ విషయంలో రాజమౌళి కంప్లెయింట్‌

ఎన్టీఆర్‌ విషయంలో రాజమౌళికి ప్రారంభం నుంచి కంప్లెయింట్స్ ఉంటూనే ఉన్నాయి. ఆయన తొలి సినిమా సమయంలోనే షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈయనేంట్రా ఇలా ఉన్నాడని మనసులో అనుకున్నాడట. అప్పట్లో తారక్‌ లావుగా ఉన్నారు. దీంతో `స్టూడెంట్‌ నెం 1` మూవీ చేసే సమయంలో రాజమౌళిలో అలాంటి ఫీలింగ్ కలిగింది. కానీ తారక్‌లోని టాలెంట్‌ని చూసి ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రాజమౌళి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. జక్కన్న ఎక్కువగా తారక్‌తోనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్‌ డ్రెస్‌ స్టయిల్‌పై రాజమౌళి కామెంట్‌
Image Credit : our own

ఎన్టీఆర్‌ డ్రెస్‌ స్టయిల్‌పై రాజమౌళి కామెంట్‌

అయితే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక వీక్‌నెస్‌ని, మరో రహస్యాన్ని వెల్లడించారు రాజమౌళి. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్‌ స్టయిల్‌ గురించి వెల్లడించారు. తారక్‌ డ్రెస్‌పై తన కంప్లెయింట్‌ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ప్రారంభంలో ఎప్పుడూ ఒక బ్లాక్‌ ప్యాంట్‌ వైట్‌ షర్ట్ ధరించేవారట. ఏ ఫంక్షన్‌కి వచ్చినా అదే డ్రెస్‌ ఉండేదట. బ్లాక్‌ ప్యాంట్‌ వైట్‌ షర్ట్ గానీ, లేదంటే జీన్స్ బ్లూ బ్లాక్‌ షర్ట్ గానీ వేసుకునేవాడట. ఎప్పుడూ అదే లుక్‌లో బోరింగ్‌గా అనిపించేదట. మార్చమని ఎన్ని సార్లు చెప్పినా వినలేదట. కానీ `రామయ్యా వస్తావయ్యా` ఈవెంట్‌కి మాత్రం కొత్తగా వచ్చాడని, ఫస్ట్ టైమ్‌ డ్రెస్సింగ్‌ స్టయిల్‌ మార్చాడని తెలిపారు రాజమౌళి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ `రామయ్యా వస్తావయ్యా` మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ఈ విషయాన్ని తెలిపారు.

Related Articles

Related image1
రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ
Related image2
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
35
లక్ష్మీ ప్రణతి వార్నింగ్‌తో ఎన్టీఆర్‌లో మార్పు
Image Credit : our own

లక్ష్మీ ప్రణతి వార్నింగ్‌తో ఎన్టీఆర్‌లో మార్పు

ఈ సందర్భంగా రాజమౌళి ఇంకా కొనసాగిస్తూ, నీట్‌గా టక్‌ వేసుకుని, అదిరిపోయే షూస్‌ ధరించి తారక్‌ చాలా స్టయిలీష్‌గా ఉన్నాడని తెలిపారు. కొత్త లుక్‌ బాగుందని, ఇదే కొనసాగించాలని తెలిపారు. అయితే ఇదంతా లక్ష్మీ ప్రణతి పని అని, ఆమె వచ్చాకనే ఎన్టీఆర్ లో మార్పు వచ్చిందన్నారు. ఆ క్రెడిట్‌ మొత్తం ప్రణతిదే అని, ఈ డ్రెస్‌ వేసుకోకపోతే ఆమె చాలా వార్నింగ్‌ లు ఇచ్చిందని తెలిపారు. ఇలా ఎన్టీఆర్‌ ఇంటి విషయాలను జక్కన్న రివీల్ చేయడం విశేషం. `రామయ్యా వస్తావయ్యా` ఆడియో వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు రాజమౌళి. అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

45
మహేష్‌తో గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తున్న జక్కన్న
Image Credit : our own

మహేష్‌తో గ్లోబల్‌ ఫిల్మ్ చేస్తున్న జక్కన్న

రాజమౌళి, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ వచ్చింది. రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటించిన ఈ సినిమా నాలుగేళ్ల క్రితం విడుదలైంది. సుమారు రూ.1250కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబు హీరోగా ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తున్నారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో ఈ గ్లోబల్‌ ఫిల్మ్ ని రూపొందిస్తున్నారు జక్కన్న. ఇందులో మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని సమాచారం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ వచ్చే నెలలో రానుంది. దీని కోసం ఓ భారీ ఈవెంట్‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారట.

55
డ్రాగన్‌ మూవీతో ఎన్టీఆర్ బిజీ
Image Credit : Asianet News

డ్రాగన్‌ మూవీతో ఎన్టీఆర్ బిజీ

మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ వినిపిస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు షూట్‌ చేసిన కంటెంట్ విషయంలో తారక్‌ సంతృప్తి చెందలేదట. దీంతో అదంతా స్క్రాప్‌ లోకి వెళ్లిందని, త్వరలో మళ్లీ కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
రమ్య మోక్ష రెండు వారాల పారితోషికం ఎంతో తెలుసా, సెలబ్రిటీ రేంజ్‌.. ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్ పండగ
Recommended image2
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved