MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాదని లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ వివాహం ఎందుకు చేసుకున్నాడో తెలుసా?

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాదని లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ వివాహం ఎందుకు చేసుకున్నాడో తెలుసా?

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి లక్ష్మి ప్రణతిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఓ సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. ఓ వ్యక్తి కోసమే ఇదంతా అని చెప్పుకొచ్చాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 18 2024, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. టీనేజ్ లోనే పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2001లో విడుదలైన నిన్ను చూడాలని ఆయన డెబ్యూ మూవీ. ఆ మూవీ నిరాశపరిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేశాడు. రాజమౌళికి అది డెబ్యూ మూవీ. ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. ఆది, సింహాద్రి చిత్రాలతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు. నేమ్, ఫేమ్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ లో వయసురీత్యా అంత పరిపక్వత రాలేదు. 

కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్... అనంతరం పాల్గొన్న ఇంటర్వ్యూలో చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్నాడు నాకు తెలిసి మా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అతిపెద్ద మాస్ హీరో అన్నట్లు మాట్లాడాడు. అది లైవ్ ఇంటర్వ్యూ కావడంతో నేరుగా టెలికాస్ట్ అయ్యింది. 

36


ఈ కామెంట్స్ కారణంగా ఎన్టీఆర్ విమర్శల పాలయ్యాడు. అక్కినేని నాగార్జున సైతం ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే వాదన ఉంది. యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ ని చుట్టుముట్టిన మరొక వివాదం లవ్ ఎఫైర్. ఓ హీరోయిన్ తో ఎన్టీఆర్ ప్రేమలో పడ్డాడు. ఆమె సమీరా రెడ్డి అని వార్తలు వచ్చాయి. 

నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి జంటగా నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ, అశోక్ మూవీలో మరోసారి జతకట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అశోక్ జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్-సమీరా రెడ్డి మధ్య సీరియస్ ఎఫైర్ నడిచినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 

46

కాగా సమీరాతో లవ్ ఎఫైర్ పై ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్పందించారు. అది యుక్త వయసులో చేసిన పొరపాటు అన్నట్లు మాట్లాడారు.  ఏదో ఒక సమయంలో, ఎవరో ఒకరి మీద ప్రేమ కలుగుతుంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యాను. కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యాను, అని ఎన్టీఆర్ అన్నారు. 

మళ్ళీ ఆ ప్రేమ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని యాంకర్ అడగ్గా.. లేదు ఒకసారి ఫిక్స్ అయ్యాక మళ్ళీ ఆలోచించను. ప్రొఫెషనల్ లైఫ్ తో పర్సనల్ లైఫ్ మిక్స్ చేయకూడదు. వాటిని వేరు వేరుగా చూడాలని తెలుసుకున్నాను.  ఆ సమయంలో మా అమ్మను ఎవరైతే బాగా చూసుకుంటారో, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. 
 

56

నా అంత కాకపోయినా నాలో సగం మా అమ్మను ఆ అమ్మాయి ప్రేమిస్తే చాలు. లక్ష్మి ప్రణతి అమ్మను బాగా చూసుకుంటుందని నమ్మాను. అందుకే లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాను, అని ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు. కేవలం అమ్మ కోసమే ప్రేమను వదులుకుని పెద్దల కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఎన్టీఆర్ పరోక్షంగా వెల్లడించాడు. 

2011లో ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి వివాహం టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. టాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో ఒకటిగా ఎన్టీఆర్ కుటుంబం ఉంది. ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా.. ఎన్టీఆర్ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

66

మరోవైపు ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. 

దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన దేవర ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తీరిక లేకుండా పాల్గొంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image3
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved