MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవిని కాదని అల్లు అర్జున్ ఇంట్లో ఆ స్టార్ హీరో ఫోటో!

చిరంజీవిని కాదని అల్లు అర్జున్ ఇంట్లో ఆ స్టార్ హీరో ఫోటో!

అల్లు అర్జున్ ఇంట్లో ఓ స్టార్ హీరో పెద్ద ఫోటో ఉందట. అది చిరంజీవి ఫోటో అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీని ఏలిన చిరంజీవిని కాదని అల్లు అర్జున్ ఎవరి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడో తెలుసా?  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 19 2024, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ ఎదుగుదలకు చిరంజీవి కూడా పరోక్షంగా కారణం అయ్యాడనేది నిజం. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మెగా హీరో అనే ట్యాగ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసింది. మెగా హీరోలందరికీ కామన్ గా అభిమానులు ఉంటారు. అలాగే ఒక సామాజిక వర్గం వాళ్ళను అనుసరిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే కొన్నాళ్లుగా మెగా హీరోలకు అల్లు అర్జున్ దూరమవుతూ వస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. కొణిదెల-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల అవి తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. 

మెగా హీరోల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది. పుష్ప చిత్రం పై పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచి, అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పటి హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నటుడిగా నాకు అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామయ్య స్పందించారు. అల్లు అర్జున్ నిజంగా స్మగ్లింగ్ చేయలేదు. అది సినిమాలో పాత్ర మాత్రమే అంటూ అసహనం వెళ్లగక్కారు. 
 

36


నాకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎక్కడికైనా వస్తాను.. అంటూ అల్లు అర్జున్ మెగా హీరోలకు సవాల్ విసిరాడు. జనసేన నాయకులు ఓపెన్ గానే అల్లు అర్జున్ పై విమర్శల దాడికి దిగడం మనం చూశాం. ఈ కోల్డ్ వార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై ప్రభావం చూపుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ ఇంట్లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించింది. 

ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఓ అభిమాని 1600 కిలోమీటర్లు అల్లు అర్జున్ ని కలిసేందుకు సైకిల్ పై వచ్చాడు. సదరు అభిమానిని అల్లు అర్జున్ స్వయంగా కలిశాడు. ఫోటోలకు పోజిచ్చాడు. ఆ అభిమాని బస్సులో తన సొంత ఊరు వెళ్లేలా అల్లు అర్జున్ తన టీమ్ తో ఏర్పాట్లు చేయించాడట. యూపీ అభిమానితో అల్లు అర్జున్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించింది. 
 

46
Allu Arjun

Allu Arjun

అది ఎన్టీఆర్ బయోగ్రఫి అట. అలాగే అల్లు అర్జున్ ఆఫీస్ లో ఎన్టీఆర్ పెద్ద ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి ఉందట. ఈ విషయం టాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ లెజెండరీ నటుడు. ఆయన ఫోటోలు చాలా మంది సెలెబ్స్ నివాసాల్లో ఉంటాయి. అలాగే ఎన్టీఆర్-అల్లు రామలింగయ్య మధ్య గట్టి అనుబంధం ఉండేదట. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మంచి మిత్రులు. మా ఇంట్లో వంట గదిలోకి కూడా అల్లు రామలింగయ్య వచ్చేసే వారని బాలకృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.  


 

56

కాబట్టి అల్లు అర్జున్ ఆఫీసులో, ఇంట్లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉండటం పెద్ద ఆశ్చర్యకర పరిణామం ఏమీ కాదని చెప్పొచ్చు. ఇక అల్లు అరవింద్ కి చెందిన ఆహా యాప్ కోసం బాలకృష్ణ హోస్ట్ గా మారారు. అన్ స్టాపబుల్ టాక్ షో సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. అన్ స్టాపబుల్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

66

మరోవైపు పుష్ప 2 విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప2  వాయిదాపడింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ పలు భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved