MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళికి నిద్రలేని రాత్రులు, ఆయన్ని అత్యంత భయపెట్టిన చిత్రం ఏమిటో తెలుసా? 

రాజమౌళికి నిద్రలేని రాత్రులు, ఆయన్ని అత్యంత భయపెట్టిన చిత్రం ఏమిటో తెలుసా? 

బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళిని ఓ మూవీ అత్యంత ఆందోళనకు గురి చేసిందట. ఆ మూవీ విడుదల సమయంలో ఆయన నిద్ర లేని రాత్రులు గడిపాడట. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ?  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 20 2024, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rajamouli

Rajamouli

రాజమౌళికి ముందు పలువురు దర్శకుడు భారీ బడ్జెట్ చిత్రాలు తీశారు. తెలుగులో మాత్రం రాజమౌళినే వందల కోట్ల బడ్జెట్ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అలాగే పాన్ ఇండియా కాన్సెప్ట్ ని పరిచయం చేసింది రాజమౌళినే అని చెప్పొచ్చు. సౌత్ లో దర్శకుడు శంకర్ రోబో, 2.0 వంటి అత్యధిక బడ్జెట్ చిత్రాలు తీశారు. అవి నార్త్ లో కూడా ఆదరణ పొందాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి పెంచారు. సినిమాలో విషయం ఉంటే భాషా భేదం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారని నిరూపించాడు. టాలీవుడ్ మార్కెట్ రూ. 100 కోట్లు కూడా లేని సమయంలో రూ. 500-600 కోట్ల బడ్జెట్ తో చిత్రాలు చేయడం అతిపెద్ద సాహసం. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల నిర్మాణం కత్తిమీద సామే. అటు ఇటు అయితే వందల కోట్ల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. 

తన టాలెంట్ పై నమ్మకంతో రాజమౌళి సాహసం చేశాడు. నిర్మాతలు కూడా ఆయనకు పూర్తి మద్దతు, సహకారం అందించారు. బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. డొమెస్టిక్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డు అలానే ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి మరో స్థాయికి వెళ్ళాడు. ప్రపంచ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ సైతం రాజమౌళిని కొనియాడారు.  

36

ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' కి ఆస్కార్ దక్కింది. అపజయం లేని దర్శకుడిగా ఉన్న రాజమౌళిని మాత్రం ఓ మూవీ అత్యంత టెన్షన్ కి గురి చేసిందట. విడుదలకు ముందు ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడట. ఆ చిత్రం మగధీర. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. 

రాజమౌళి మాట్లాడుతూ... నా సినిమా విడుదలవుతుందంటే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంతే. కానీ మగధీర విషయంలో నేను చాలా టెన్షన్ కి గురయ్యాను. నేను తీసిన ఆరు సినిమాల్లో ఏ సినిమాకు పడని ఆందోళన, ఆ సినిమాకు పడ్డాను. ఎందుకంటే... ఈ సినిమా బడ్జెట్ పరిధులు దాటేసింది. బిజినెస్ కూడా అలానే జరిగింది. 

46


అందులోనూ పరిశ్రమలో విడుదలకు ఓ పదిరోజుల ముందే చర్చ మొదలైంది. అందరూ మగధీర పెద్ద హిట్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నాలో ఆందోళన ఎక్కువైంది. అందుకే మగధీర విజయం నాకు ఎక్కువ సంతోషం కలిగించింది. మిగతా చిత్ర విజయాలతో పోల్చుకుంటే చాలా ప్రత్యేకం, అన్నారు. 

రామ్ చరణ్ రెండో చిత్రంగా మగధీర తెరకెక్కింది. అప్పటికి రామ్ చరణ్ కి చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. నిర్మాత అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో చాలా ఆందోళనకు గురయ్యారని సమాచారం. ఈ విషయంలో రాజమౌళిని ఒత్తిడి గురి చేశాడట. ఉన్నదంతా పెట్టి, అప్పులు చేసి మగధీర చేస్తున్నాను. ఇది చాలా పెద్ద రిస్క్ అనేవాడట. 

56

మగధీర ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అరవింద్ పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించాడు. కానీ రాజమౌళికి లాభాల్లో ఒక్క రూపాయి కూడా షేర్ ఇవ్వలేదట. మరోవైపు చిరంజీవి మగధీర క్రెడిట్ అంతా చరణ్ దే అని ప్రచారం చేశాడట. అసహనానికి గురైన రాజమౌళి... సునీల్ తో మర్యాద రామన్న, నానితో ఈగ మూవీ చేశాడనే, ఓ వాదన పరిశ్రమలో ఉంది. 

 

66
Magadheera

Magadheera

ఒక కమెడియన్ ని, చివరికి చిన్న ఈగను హీరోగా పెట్టి  సినిమా తీసి కూడా హిట్ కొట్టగలనని నిరూపించేందుకు రాజమౌళి ఆ చిత్రాలు చేశాడట. ఈ పుకార్లలో నిజమెంతో తెలియదు కానీ... ప్రచారం జరిగింది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image2
Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్‌.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Recommended image3
Singer Jhansi: పాటలు పాడితే ఆపేశారు, ఎలిమినేషన్‌ అన్‌ఫెయిర్‌.. ట్రోల్స్ పై సింగర్‌ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved