అందుకే డిస్కనెక్ట్ అయ్యానని చెప్పి అందరి అనుమానాలు తీర్చేసిన చైతూ!
నాగ చైతన్య అందరి అనుమానాలు తీర్చేశాడు. ఆయన సమాధానం అందరి కంటే చాలా భిన్నంగా ఉంది. ఇంతకీ నాగ చైతన్య షేర్ చేసిన ఆ షాకింగ్ పర్సనల్ విషయం ఏమిటంటే..

సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై సాధారణ జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అందుకే నాగ చైతన్య, సమంత విడాకులు అంత చర్చకు దారితీశాయి. సమంత, నాగ చైతన్య విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయంలో అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ఎవరి థీరీలు వారు రాసుకున్నారు. అసలు నిజం ఏమిటనేది వారికి మాత్రమే తెలుసు.
సమంత కనీసం సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశారు. ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె పరోక్షంగా తాను ఏ తప్పు చేయలేదని పరోక్షంగా చెప్పేవారు. నాగ చైతన్య మాత్రం టోటల్ సైలెంట్. విడాకుల ప్రకటన మినహాయిస్తే నాగ చైతన్య ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేయలేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ వాడిన దాఖలాలు కూడా లేవు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి హీరో పబ్లిసిటీ కోరుకుంటారు. తమ చిత్రాలకు ప్రధాన ప్రచార సాధనంగా సోషల్ మీడియాను వాడుకుంటారు. నాగ చైతన్య మాత్రం ఇందుకు డిఫరెంట్. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉండరు. దీనికి కారణం ఏమిటో తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.
Naga Chaitanya
నాకు ఆన్లైన్ లో ఉండడం, సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉండటం అంటే బోరింగ్. ఎందుకో నాకు అది నచ్చలేదు. ఆ కారణంగానే నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. సోషల్ మీడియా నాకు అంతగా కనెక్ట్ కాలేదు. అందుకే డిస్కనెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. అలాగే సోషల్ మీడియా చాలా ప్రమాదమన్న నాగ చైతన్య చెడుకి మంచికి గల తేడా గుర్తించగలగాలి అన్నారు.
మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న నాగ చైతన్యకు థాంక్యూ మూవీ అడ్డుకట్ట వేసింది. ఈ మూవీ చైతూ కెరీర్లోనే దారుణ పరాజయం చవిచూసింది. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఇది తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. అలాగే దూత టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.