- Home
- Entertainment
- బాలయ్యతో కాజల్ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం తెలుసా..? కాజల్ అంత పని చేసిందా..?
బాలయ్యతో కాజల్ కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం తెలుసా..? కాజల్ అంత పని చేసిందా..?
కాజల్ దాదాపు చిన్నా పెద్ద హీరోలందరితో జత కలిసింది, మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోలతో కూడా డ్యూయెట్లు పాడింది. మరి నటసింహం బాలయయతో కాజల్ కాంబినేషన్ ఎందుకు పడలేదు. దానికి కారణం ఏంటీ..?

బాలయ్య బాబుతో సినిమా అంటే చాలు హీరోయిన్లు గంతులేసి ఒప్పుకుంటారు. మాస్ ఫ్యాన్స్ లో బాలయ్యకు ఉన్న బలం అది. ఒక్క సారి నటసింహంతో చేస్తే.. బాలయ్య హీరోయిన్ అనే ముద్ర పడటంతో పాటు ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. బాలకృష్ణతో ఇప్పటి వరకూ చాలా మంది హీరోయిన్లు నటించారు కాని.. కాజల్ మాత్రం బాలయ్యతో ఒక్క సినిమా కూడా చేయలేదు.ఎందుకు..? కారణం ఏంటీ..?
కాజల్ తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించినప్పటికీ తెలుగు సినిమాల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ తెలుగులో మొదటి సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం అయినప్పటికీ, చందమామ సినిమా ద్వారా కాజల్ కి మంచి పేరొచ్చింది. ఆ తరువాత మగధీర వంటి బ్లాక్ బాస్టర్ హిట్లోతో దూసుకుపోయింది.
చిన్నా పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ప్రస్తుతం మాత్రం కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. పెళ్ళి, పిల్లాడు పుట్టడంతో.. కాజల్ ఫ్యామిలీతో.. బిజీ అయిపోయింది. అయితే కాజల్ అగర్వాల్ త్వరలో మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చందమామ తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినా ఒకప్పటిలా ఆఫర్లు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.
కాజల్ సీనియర్ హీరోలతో కూడా నటించింది కాని ఇప్పటి వరకూ బాలయ్యతో జత కట్టలేదు. అటు నట సింహం బాలయ్య బాబు ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు. ఎంతోమంది ముద్దుగుమ్మలు ఆయన పక్కన ఆడిపాడారు. కానీ బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు.
అయితే వీరిద్దరి కాంబినేషన్ మూవీ రాకపోవడానికి.. కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల కోసం దర్శకులు కాజల్ ను సంప్రదించారు. అయితే ఆ టైంలో కాజల్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఫ్యూచర్ లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో లేదో వేచి చూడాలి.
మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 లో మెరిసిన ఈ హీరోయిన్ .. రీసెంట్ గా వచ్చిన ఆచార్య సినిమాలో కొన్ని సీన్లలో కాజల్ నటించినప్పటికి కొన్ని కారణాల వల్ల ఆమె సీన్లను తొలగించారు.ఈ మధ్య కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు కాజల్ అగర్వాల్ లక్కీ హీరోయిన్ కావడం గమనార్హం.
సినిమాలకు బ్రేక్ పడ్డా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది కాజల్. బిడ్డ పుట్టిన తరువాత కూడా వరుసగా ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. ఇక కాజల్ రీ ఎంట్రీ తర్వాత కూడా అద్భుతమైన విజయాలు అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి కాజల్ త్వరలో రీ ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా కూడా ఎటువంటి పాత్రలు పడతాయి..? ఏం చేస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.