- Home
- Entertainment
- Anchor Shyamala Opinion On RGV : ఆర్జీవీపై యాంకర్ శ్యామల అభిప్రాయం ఇదే.. ఆయన ఫిల్మ్స్ పైనా కామెంట్..
Anchor Shyamala Opinion On RGV : ఆర్జీవీపై యాంకర్ శ్యామల అభిప్రాయం ఇదే.. ఆయన ఫిల్మ్స్ పైనా కామెంట్..
స్పెషల్ యాంకరింగ్ స్కిల్స్ తో తెలుగు టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరయ్యారు శ్యామల (Anchor Shyamala). ఇటీవల డైరెక్టర్ ఆర్జీవీ తనపై కామెంట్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా శ్యామల కూడా ఆర్జీవీపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. ఆయన సినిమాలపైనా కామెంట్ చేసింది.

ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని యాంకర్లలో యాంకర్ శ్యామల (Anchor Shyamala) ఒకరు. స్పెషల్ యాంకరింగ్ స్కిల్స్ తో తెలుగు టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరయ్యారు శ్యామల. టెలివిజన్ ఆడియెన్స్ కు పల్స్ తెలిసిన యాంకర్ల లో స్టార్ యాంకర్ సుమ (Suma) తర్వాత శ్యామల ఒకరు అని చెప్పొచ్చు.
ఏపీలోని కాకినాడకు చెందిన శ్యామల వ్యాఖ్యాతగా తన ప్రతిభను చూపిస్తూ.. టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే ఒకింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ యాంకర్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 (Bigg Boss Telugu 2) లో అవకాశం దక్కించుకుంది.
బిగ్ హౌజ్ లోనూ తన మార్క్ చాటుకుంది. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ హౌస్ లో సందడి నెలకొల్పడంలో శ్యామల ప్రయత్నం ఆడియెన్స్ ను మరింతగా అలరించింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్యామల సెలబ్రెటీ జాబితాలోకి చేరిపోయింది. చాలా డీసెంట్ గా, గ్లామర్ గానూ బుల్లితెరపై అలరించే శ్యామల ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేయడంలో మేటీ అని చెప్పొచ్చు.
ఆమెకున్న పాపులారిటీ ఆధారంగానే చిన్న సినిమాల ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కువగా శ్యామలాకే దక్కుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ‘బడవ రాస్కేల్’ (Badava Rascal) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) గెస్ట్ గా హాజరయ్యారు.
ఈవెంట్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ యాంకర్ శ్యామలపై బోల్డ్ కామెంట్ చేశారు. ‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సర్క్యూలేట్ అయ్యింది. అయితే యాంకర్ శ్యామల తాజాగా తన ఫ్యాన్స్ తో ఇన్ స్టాలో చాట్ సెషన్ నిర్వహించింది.
ఈ సంద్భంగా ఓ అభిమాని శ్యామలను ఆర్జీవీ గురించి చెప్పండి అంటూ అడిగాడు. ఇందుకు శ్యామల స్పందిస్తూ .. ‘నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు’ అని తెలిపింది. అంతేకాకుండా వర్మ చిత్రాలపైనా స్పందిస్తూ ‘ఒకప్పటి వర్మ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని’ అంటూ.. ప్రస్తుతం ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మూవీలపైనా ఇన్ డైరెక్ట్ గా తనకు నచ్చడం లేదని పేర్కొంది. ఏదేమైనా యాంకర్ శ్యామల తనదైన శైలిలో ఆర్జీవీపై అభిమానాన్ని చూపిస్తూనే.. ఆయన ఫిల్మ్స్ పైనా వ్యంగ్యాంగా స్పందించింది.