తన ఏడేళ్ల కొడుక్కి యానిమల్ మూవీ చూపించిన సందీప్ రెడ్డి వంగ... రియాక్షన్ ఏంటో తెలుసా?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ తో హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేశాడు. యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్టో అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కాగా యానిమల్ మూవీ చూసిన తన ఏడేళ్ల కొడుకు రియాక్షన్ ఏమిటో సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పాడు.
సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో క్యారెక్టర్స్ వైలెంట్ గా ఉంటాయి. ఇంటెన్స్ ఎమోషన్స్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ రెడ్డి మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ విమర్శలపాలైంది. అప్పట్లో ఆ చిత్రం మీద డిబేట్లు పెట్టారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించారు. కబీర్ సింగ్ సైతం క్రిటిసిజం ఎదుర్కొంది. ఈ రెండు చిత్రాలకు మించిన వ్యతిరేకత యానిమల్ మూవీపై వ్యక్తం అయ్యింది. చిత్ర ప్రముఖులతో పాటు సాంప్రదాయవాదులు, ఫెమినిస్ట్స్ ఆరోపణలు చేశారు.
Animal movie
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాత్రం తనని తాను సమర్ధించుకున్నారు. విమర్శలు చేసిన వాళ్లకు తనదైన కౌంటర్లు విసిరాడు. ఈ క్రమంలో యానిమల్ మూవీపై సందీప్ రెడ్డి వంగ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. తాజా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగను... యానిమల్ మూవీ మీ ఏడేళ్ల అబ్బాయికి చూపించారా? అని అడగడమైంది.
సందీప్ రెడ్డి వంగ సమాధానంగా... అడల్ట్ కంటెంట్ లేకుండా ఎడిట్ చేసిన వెర్షన్ ఒకటి సేవ్ చేసి గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా మా అబ్బాయి అర్జున్ రెడ్డికి చూపించాను. వాడికి సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా అండర్ వేర్ యాక్షన్ ఎపిసోడ్స్ చూసి బాగా నవ్వుకున్నాడని, అన్నారు. ఇక తన భార్య మనీషా రక్తపాతంతో కూడిన సన్నివేశాలకు డిస్టర్బ్ అయ్యింది. అయితే మహిళలను చూపించిన విధానం పై ఆమె అభ్యంతరం చెప్పలేదు అన్నారు.
రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీ తెరకెక్కింది. రష్మిక మందాన హీరోయిన్. విమర్శల మధ్య యానిమల్ భారీ విజయం అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు. సందీప్ రెడ్డి వంగ తమ్ముడు ప్రణయ్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.
నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కించనున్నాడు. అనంతరం యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేస్తారు. అనంతరం అల్లు అర్జున్ తో మూవీ అని సమాచారం.