ప్రభాస్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే.. ‘ఆదిపురుష్’ వల్లేనా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం భారీ చిత్రాలైన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ లో నటిస్తున్నారు. ఇక ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో డార్లింగ్ అభిమానులకు సంబంధించి ఓ ఛేదు వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతటా చాటిచెప్పిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ చిత్రాల్లో నే నటిస్తున్నారు. ఏకంగా వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాలపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి.
చివరిగా ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో తదుపరి చిత్రాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘ఆదిపురుష్’తో ఫుల్ మీల్స్ అందించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కూడా సినిమాలపై భారీ అంచనాలను పెంచేశాయి.
అయితే, దీపావళి సందర్భంగా ‘ఆదిపురుష్’ Adipurush చిత్రం నుంచి టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అప్డేట్స్ కూడా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వీఎఫ్ఎక్స్, సీన్స్, ప్రభాస్ లుక్ కూడా చాలా నార్మల్ గా ఉన్నాయంటూ ట్రోల్స్ కూడా జరిగాయి. మరోవైపు వివాదం కూడా కొనసాగుతోంది.
ఇదే సమయంలో డార్లింగ్ నటిస్తున్న ‘సలార్’ (Salaar), ప్రాజెక్ట్ కే (Project K) చిత్రాల నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమాలపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆదిపురుష్ రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో ఆ సినిమాల అప్డేట్స్ రావడం ‘ఆదిపురుష్’కు అనుకూల ఫలితాలనివ్వడం లేదు.
దీంతో మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘ఆదిపురుష్’ రిలీజ్ అయ్యే వరకు సలార్, ప్రాజెక్ట్స్ కే నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకూడదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో రెండు నెలల వరకు ‘ఆదిపురుష్’ మినహా మరే చిత్రాల నుంచి అప్డేట్స్ రావడం కష్టమనే అంటున్నారు.
ఇక ‘ఆదిపురుష్’ వీఎఫ్ ఎక్స్ ను మరింత డెవలప్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే చిత్రంపై వచ్చిన ఆరోపణలు, ట్రోల్స్ కు సంబంధించిన సన్నివేశాలను మరింత మెరుగ్గా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ మైథలాజికల్ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.