MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలనుకున్న మహేష్ సిస్టర్... అభిమానులు ఫైర్, కృష్ణ ఏం చేశారంటే?

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలనుకున్న మహేష్ సిస్టర్... అభిమానులు ఫైర్, కృష్ణ ఏం చేశారంటే?

మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టాల్సింది. అంతా ఓకే అనుకున్నాక అడ్డంకులు ఏర్పడ్డాయి. అభిమానుల దెబ్బకు కృష్ణ సైతం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ హీరోతో మంజుల నటించడాన్ని అభిమానులు ఎందుకు తిరస్కరించారో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 18 2024, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటారు. అభిమాన హీరో విజయాలు, పరాజయాలు తమవిగా భావిస్తారు. ఆ హీరో, ఆయన కుటుంబం అందుకునే గౌరవాలు తమకు దక్కిన గౌరవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వారి బాధలు, సంతోషాలు,అవమానాలు తమవిగా ఫీల్ అవుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హద్దులు దాటిన అభిమానం ఒక్కోసారి హీరోలకు తలనొప్పిగా మారుతుంది. మీరు అలా చేయడానికి వీలు లేదని ఆంక్షలు కూడా పెడుతుంటారు. అభిమానుల మనోభావాలు చాలా ముఖ్యం. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే. లేదంటే పొగిడిన నోటితోనే తిడతారు కూడా. 

37
Manjula Ghattamaneni

Manjula Ghattamaneni

టాలీవుడ్ లో కృష్ణ అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పోటీ పడిన ఏకైన స్టార్ కృష్ణ మాత్రమే. ఆయన సినిమా విడుదల అంటే థియేటర్స్ కి జనాలు పోటెత్తేవారు. కృష్ణకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కాగా కృష్ణ రెండో కుమార్తె మంజుల హీరోయిన్ కావాల్సింది. ఓ స్టార్ హీరోకి జంటగా ఆమె నటించాల్సి ఉండగా... అభిమానులు ఒప్పుకోలేదు. 
 

47
Mahesh Babu

Mahesh Babu

మంజులకు నటన పట్ల మక్కువ ఉంది. ఆమె హీరోయిన్ కావాలి అనుకున్నారు. ఈ విషయం తెలిసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలి అనుకున్నారు. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి వరుసగా మూడు హిట్స్ ఇచ్చాడు. కృష్ణ హీరోగా చేసిన నెంబర్ వన్ మంచి విజయం సాధించింది. యమలీల, శుభలగ్నం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. 
 

57
Super Star Krishna

Super Star Krishna

దాంతో బాలకృష్ణ హీరోగా టాప్ హీరో ప్లాన్ చేశాడు. ఈ మూవీలో మంజులను హీరోయిన్ గా అనుకున్నారు. కృష్ణ కూడా పచ్చ జెండా ఊపాడు. అయితే బాలకృష్ణతో మంజుల నటించడం కృష్ణ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అసలు కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ కావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందులోనూ ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. చాలా గొడవలు జరిగాయి. 
 

67
Top Hero Movie

Top Hero Movie

సినిమాల పరంగా, రాజకీయంగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఈ క్రమంలో బాలకృష్ణతో మంజుల నటించడాని కృష్ణ ఫ్యాన్స్ ససేమిరా అన్నారు. ఈ కాంబినేషన్ సెట్ చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిని కూడా కృష్ణ అభిమానులు తిట్టిపోశారట. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కృష్ణ వెనక్కి తగ్గాడు. హీరోయిన్ కావాలన్న మంజుల ఆశలపై కృష్ణ ఫ్యాన్స్ నీళ్లు చల్లారు. 
 

77
Mahesh Babu

Mahesh Babu

మంజులను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న ఆలోచన ఎస్వీ కృష్ణారెడ్డి విరమించుకున్నాడు. సౌందర్యను ఎంపిక చేశారు. 1995లో విడుదలైన టాప్ హీరో డిజాస్టర్ అయ్యింది. తర్వాత నాగార్జున హీరోగా వజ్రం టైటిల్ తో మూవీ చేశారు. అది కూడా ప్లాప్ అయ్యింది. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ హీరోల జోలికి పోలేదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved