MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరుతో మూవీ అంటే ఫ్లాపే, భయపడి ఇండస్ట్రీ హిట్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

చిరుతో మూవీ అంటే ఫ్లాపే, భయపడి ఇండస్ట్రీ హిట్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్.. మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్

కొంతమంది దర్శకులు అయితే ఒక్కసారి అయినా చిరంజీవి ని డైరెక్ట్ చేయాలి అని కలలు కంటుంటారు. ఒక దర్శకుడు చిరంజీవితో సినిమా అంటే భయపడి ఆఫర్ రిజెక్ట్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరు ? ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 07 2025, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఆసక్తి చూపుతుంటారు. కొంతమంది దర్శకులు అయితే ఒక్కసారి అయినా చిరంజీవి ని డైరెక్ట్ చేయాలి అని కలలు కంటుంటారు. ఒక దర్శకుడు చిరంజీవితో సినిమా అంటే భయపడి ఆఫర్ రిజెక్ట్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దర్శకుడు ఎవరు ? ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవితో సినిమా అనగానే భయపడి క్రేజీ ఆఫర్ ని ఒక స్టార్ డైరెక్టర్ రిజెక్ట్ చేశారట. ఆ దర్శకుడు ఎవరో కాదు సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ అందించిన బి గోపాల్. ఇంద్ర చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం బి గోపాల్ కి దక్కింది. కానీ అంతకు ముందే గోపాల్.. చిరంజీవితో స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో మెకానిక్ అల్లుడు చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 

36

రచయిత చిన్ని కృష్ణ.. పరుచూరి బ్రదర్స్ కి ఇంద్ర కథ వినిపించారు. వాళ్ళకి కథ అద్భుతంగా నచ్చింది. అయితే కొన్ని మార్పులు అవసరం. కథని అశ్విని దత్, బి గోపాల్ ఇద్దరికీ వినిపించారు. వాళ్ళకి కథ నచ్చలేదట. దీనితో బి గోపాల్ నేను చేయను అని చెప్పారు. పరుచూరి బ్రదర్స్ ఎక్కడ ఈ కథని చిరంజీవికి చెప్పి ఒప్పిస్తారో ? దర్శకుడిగా నా పేరు చెబుతారో ? అని బి గోపాల్ టెన్షన్ పడుతున్నారు. 

46

కథ నచ్చకపోవడం ఒక కారణం అయితే.. అంతకు ముందే బి గోపాల్ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలు చేసి ఉన్నారు. మరోసారి ఫ్యాక్షన్ ఎందుకు అనేది ఆయన ఫీలింగ్. దీనికి తోడు చిరంజీవితో తెరకెక్కించిన మెకానిక్ అల్లుడు చిత్రం డిజాస్టర్ అయింది. మరోసారి చిరంజీవితో చెత్త కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందేమో, విమర్శలు వస్తాయి ఏమో అని బి గోపాల్ భయపడ్డారు. చిరంజీవి గారికి ఈ కథ చెప్పొద్దు, నేను ఈ చిత్రం  చేయలేను అని బి గోపాల్ పరుచూరి బ్రదర్స్ కి చెప్పేశారు. 

56

కానీ చివరికి పరుచూరి గోపాల కృష్ణ బి గోపాల్ ని ఒప్పించారు. ఫ్యాక్షన్ అనేది సక్సెస్ ఫుల్ ఎలిమెంట్. దానిని మరో కోణంలో చూపిస్తే ఎన్నిసార్లు అయినా సక్సెస్ అవుతూనే ఉంటుంది. బాలకృష్ణ వేరు.. చిరంజీవి వేరు.. రొటీన్ గా అనిపించదు అని పరుచూరి గోపాల కృష్ణ.. బి గోపాల్ ని కన్విన్స్ చేశారు. స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చిన్ని కృష్ణ ఈ కథని గోదావరి బాక్ డ్రాప్ లో చెప్పారట. ఇది మార్చాలి అని పరుచూరి బ్రదర్స్ కోరడంతో.. కథ గోదావరి బాక్ డ్రాప్ నుంచి కాశీ బాక్ డ్రాప్ కి వెళ్ళింది. 

66

అంతా ఒకే అనుకున్నాక కథని చిరంజీవికి వినిపించారు. చిరంజీవి వెంటనే షూటింగ్ ప్రారంభించండి అని చెప్పారట. షూటింగ్ చివరి దశలో ఉండగా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్ ని, రాననుకున్నారా రాలేననుకున్నారా డైలాగ్ ని పరుచూరి గోపాలకృష్ణ క్రియేట్ చేశారట. ఆ డైలాగ్స్ విన్న వెంటనే చిరంజీవి కేవలం గంటలో పరుచూరి గోపాలకృష్ణకి సోనీ ఎరిక్సన్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ గిఫ్ట్ ని ఎప్పటికీ మరచిపోలేను అని పరుచూరి అన్నారు.  ఇంద్ర మూవీ రిలీజ్ అయి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved