- Home
- Entertainment
- NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గొప్ప లక్షణాలివే.. అందుకే అభిమానులకు తారక్ అంటే అంతలా ఇష్టం..
NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గొప్ప లక్షణాలివే.. అందుకే అభిమానులకు తారక్ అంటే అంతలా ఇష్టం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజును ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా వందల సంఖ్యలో తారక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ కున్న గొప్ప లక్షణాల వల్లే ఆయనను ఇంతలా ఆదరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నిస్సందేహంగా అత్యుత్తమ నటుడు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు లక్షణాలతో జూనియర్ ఎన్టీఆర్ అతని వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా పట్ల ఎన్టీఆర్ అంకితభావం, ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తో తన బెస్ట్‌ని అందించాలనే పూర్తి విధేయతే ఆయనను ఆకాశానికి ఎత్తాయి. కొన్నేండ్లుగా తారక్ అద్భుతమైన ప్రదర్శనకు ఇండస్ట్రీ ‘యంగ్ టైగర్ ఆఫ్ టాలీవుడ్’ అనే బిరుదును ఇచ్చింది. తన కేరీర్ లో ఆది(2002,) సింహాద్రి(2003,) టెంపర్(2015,) అరవింద సమేత వీర రాఘవ(2018,) జనతా గ్యారేజ్ (2019,) ఇటీవల ‘RRR’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించాడు.
సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రభావవంతమైన స్టార్లలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఒకరుగా నిలిచారు.నటన, డ్యాన్స్ లేదా డైలాగ్ డెలివరీ వంటి అన్ని రకాల నైపుణ్యాలున్న కారణంగా ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరకాల ముద్రను వేసుకున్నారు. అదే విధంగా ప్రముఖ ఇండియన్ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ విడుదల చేసిన జాబితాలోనూ ఎన్టీఆర్ మొదటి వ్యక్తి కావడం విశేషం. ఇంతటి స్థాయిని దక్కించుకోవడానికి కారణంగా కేవలం ఆయన డెడికేషన్ మరియు సినిమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం.
స్టార్‌డమ్‌తో పాటు తన నడవడికతో అసంఖ్యాక అభిమానుల హృదయాల్లో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేక్ రెండింతలుగా పెరిగింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదగడంతో సోషల్ మీడియాలో నూ గట్టిగానే ఫోలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ట్విటర్ లో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు.
ఎన్టీఆర్ సినిమాలకు ఎంత గౌరవం ఇస్తారో... తన అభిమానులకు రెండింతలు ఎక్కువగానే ప్రేమ చూపిస్తాడు. ప్రతి సినిమా ఫంక్షన్ లోనూ ఆయన అభిమానులను ప్రత్యేకంగా సూచిస్తారు. ఈవెంట్‌లోనూ అభిమానులను ఎంతో ప్రేమగా, గౌరవంగా సంబోధించేవాడు. తన సినిమా కార్యక్రమాలకు హాజరైన తర్వాత ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, తనకు అత్యంత ప్రియమైన వారిని, తన తండ్రి హరికృష్ణ మరియు సోదరుడిని ప్రమాదంలో ఎలా కోల్పోయారో గుర్తుచేసుకుంటూ చాలాసార్లు అభిమానుల క్షేమాన్ని కోరారు.
అంతేగాకుండా అనారోగ్యంతో ఉన్న అభిమానులను ఆదుకుంటూ వారి హృదయాలను గెలుచుకున్నాడు. గతంలో ఓ వీరాభిమాని ప్రమాదానికి గురైనప్పుడు వీడియో కాల్ చేసి ఆర్థికంగానూ భరోసానిచ్చారు. కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నా అభిమానిని చూసేందుకు వెళ్లాడు. ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. అంతేకాకుండా సినీ పరిశ్రమలోనూ తారక్ అంటే ఇష్టపడే సెలబ్రెటీలు ఉన్నారు. ఈ రోజు వారంత ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో ట్వీటర్ పేజీలు నిండిపోయాయి.
ఎన్టీఆర్‌కి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తారక్‌కి జపాన్‌లో పేరు రావడానికి ఒక కారణం అతను అద్భుతంగా డాన్స్ చేయడం. అతని 2013 యాక్షన్-కామెడీ చిత్రం బాద్షా ఆ దేశంలో విడుదలైన మొదటి తెలుగు చిత్రం. ఆయన నటనకు జపాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
ఇండస్ట్రీలో తారక్ లాగా ఊపిరి తీసుకోకుండా ఏకధాటిగా డైలాగ్స్ చెప్పే వారు ఎవరూ లేరు. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లోని అత్యుత్తమ డ్యాన్సర్‌లలో ఒకరు. హిప్-హాప్ నుండి మంచి టాప్ డ్యాన్స్ వరకు ఎన్టీఆర్ దుమ్ము దులుపుతాడు. ఎవరికీ తెలియని మరోవిషయం ఎంటంటే.. ఎన్టీఆర్ కు కూచిపూడి డాన్సర్ కూడాను.
అతిపెద్ద కుటుంబం నుండి వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ చాలా సాధారణంగా కనిపిస్తారు. అందరితోనూ కలిసి మెలిసి ఉంటారు. ఇటు ఇంట్లోనూ.. అటు సెట్స్ లోనూ చాలా సరదాగా ఉంటారు. అందరితోనూ కలివిడిగా ఉంటూ ఆ క్షణం తనచుట్టూ ఉన్నవారి మొహంలో నవ్వులు పూయిస్తారు. ఈ విషయాన్ని ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలను చూస్తే అర్థమవుతోంది. ఆయన సింప్లిసిటీనే తారక్ ను ఈ స్థాయిలో నిలబెట్టిందనడానికి ఎలాంటి సందేహం లేదు.