MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. డైరెక్టర్ చేసిన పనికి బోరున ఏడ్చేసిన రమ్య కృష్ణ.. ఏమైందంటే?

సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. డైరెక్టర్ చేసిన పనికి బోరున ఏడ్చేసిన రమ్య కృష్ణ.. ఏమైందంటే?

‘నరసింహ’ మూవీలో ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అందులో సౌందర్య ముఖంపై రమ్య కృష్ణన్ కాలు పెట్టే సీన్ ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. అయితే ఆ సీన్ చేయడం వెనక పెద్ద కథే ఉందంటున్నారు డైరెక్టర్ కేఎస్ రవికుమార్.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 24 2022, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), సౌందర్య (Soundarya) జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘నరసింహ’. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ తెరకెక్కించారు. 1999లో మూవీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
 

26

ఈ చిత్రంలో రజినీకాంత్, సౌందర్య హీరోయిన్లు గా నటించారు. రమ్య కృష్ణ (Ramya Krishna) నెగెటివ్ రోల్ ను పోషించింది. ఈ చిత్రంలో హైలెట్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని సన్నివేశాలను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా సౌందర్య ముఖంపై రమ్య కృష్ణ కాలు పెట్టే సీన్ అందరినీ ఆకట్టుకుంది.
 

36

అయితే ఈసీన్ పట్ల అప్పట్లో ఎన్నో రూమార్లు పుట్టుకొచ్చాయి. అది నిజం కాదని, డూప్ లతో చేయించారని ప్రచారం జరిగింది. అసలు ఆ షాట్ వెనుక ఉన్న అసలు నిజం తెలిసిపోయింది. ఆ ఒక్క సీన్ కోసం దర్శకుడు, రమ్య కృష్ణ చాలానే ఇబ్బంది పడ్డారని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తెలిపారు.
 

46

ఈ చిత్రం వచ్చే వరకే రమ్య కృష్ణ పాతిక సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పటికే సౌందర్య స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో సౌందర్య మొహంపై కాలుపెట్టడం రమ్య కృష్ణకు పెద్ద సమస్యగా మారింది. తను ఆ సీన్ చేయనంటే చేయనని డైరెక్టర్ తో చెప్పిందంట. 
 

56

అయినా డైరెక్టర్ వినిపించుకోకుండా.. తప్పకుండా చేయాల్సిందేనని నచ్చజెప్పాడు. కానీ రమ్య కృష్ణకు మాత్రం సౌందర్య లాంటి హీరోయిన్ పై కాలు పెట్టడం నచ్చలేదంట. దీంతో సౌందర్యనే రమ్య కృష్ణకు భరోసానిచ్చి.. మొహంపై తానే రమ్యకృష్ణ కాలును పెట్టుకుంది. ఈ సీన్ తర్వాత రమ్య కృష్ణ బోరున ఏడ్చేసింది. తర్వాత కాస్ట్ ఆమెను ఊరుకోబెట్టారని డైరెక్టర్ చెప్పాడు. 
 

66

నరసింహ చిత్రంతోనే రమ్య కృష్ణకు తొలిసారిగా బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్ అవార్డ్ దక్కించింది. ఆ తర్వాత ఆమె కేరీర్ కు తిరుగులేదు. బహుబలిలో శివగామి పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే ఉంది. ఇక సౌందర్య 2004లో ఎయిర్ ప్లేన్ క్రాష్ లో చనిపోయిన సంగతి తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani
రమ్య కృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Thanuja: పెళ్లైన వ్యక్తిపై తనూజకి క్రష్‌.. పబ్లిక్‌గా చెప్పిన బిగ్‌ బాస్‌ నటి, ఈ యాంగిల్‌ కూడా ఉందా?
Recommended image2
గరికపాటి పై మరోసారి రెచ్చిపోయిన నా అన్వేషణ, నేను బ్రహ్మ, మీరు విష్ణు అంటూ.. ఎగతాళి చేసిన యూట్యూబర్..
Recommended image3
Raasi: అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు, రాశికి ఇచ్చిపడేసిన అనసూయ.. నా పేరు వాడితేనే వాళ్లకి పాపులారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved