Tamannaah: ట్రోలర్స్ కి మళ్లీ దొరికిపోయిన తమన్నా, ఆ ఫోటోలు మొత్తం రచ్చ రచ్చ
తమన్నా గతంలోనే బోల్డ్ సీన్లు చేసి ట్రోలర్స్ కి గురయ్యింది. ఇప్పుడు మరోసారి ట్రోలర్స్ కి గట్టిగా దొరికిపోయింది. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం తెగించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

స్పెషల్ సాంగ్స్ తో తమన్నా బిజీ
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హీరోయిన్‌గా కంటే స్పెషల్ సాంగ్‌లతోనే మెప్పిస్తోంది. అవే ఆమెకి విశేషమైన గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొస్తున్నాయి. హీరోయిన్‌గా వచ్చే పేరు కంటే ఈ పాటల ద్వారా వచ్చే క్రేజ్ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే వెబ్ సిరీస్‌లు, ఓటీటీ మూవీస్ కోసం తమన్నా తెగిస్తూ, హద్దులు దాటే ప్రదర్శనతో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏకంగా ఆమె ట్రోలర్స్ బారిన పడింది.
నెట్ ఫ్లిక్స్ లోకి `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్`
హిందీలో తాజాగా `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` పేరుతో ఒక వెబ్ సిరీస్‌ని రూపొందింది. ఇది ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి అర్యాన్ ఖాన్ దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షారూఖ్ ఖాన్ నిర్మించారు. బాలీవుడ్‌లో సినిమా ఇండస్ట్రీ తెరవెనుక విషయాలను, స్టార్స్ స్ట్రగుల్స్ ని ఇందులో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సిరీస్‌లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, లక్ష్యా అనే కొత్త కుర్రాడు మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆయనకు జోడీగా సహర్ బాంబా హీరోయిన్‌గా చేస్తుంది.
బాలీవుడ్ స్టార్స్ మొత్తం మెరవబోతున్న సిరీస్
గెస్ట్ రోల్స్ లో బాలీవుడ్ మొత్తం కనిపించబోతుంది. షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, సల్మాన్ ఖాన్, సాజిద్ నడియద్ వాలా, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అలియాభట్, బాద్షా, దిల్జిత్ దోసాంజే, కరణ్ జోహార్, యోయో హనీ సింగ్, దిశా పటానీ ఇలా దాదాపు అందరు యాక్టివ్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో మరో విశేషమేంటంటే తెలుగు నుంచి రాజమౌళి కూడా కనిపిస్తుండటం విశేషం.
తమన్నా ఆ లుక్‌పై ట్రోలింగ్
ఇదిలా ఉంటే ఈ `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్‌లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. `గఫూర్` పేరుతో ఈ సాంగ్‌ని రూపొందించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. త్వరలో పూర్తి పాట రానుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఇందులో తమన్నా డ్రెస్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇందులో బికినీలో కనిపించింది తమన్నా. అది మామూలుగా లేదు. బికినీ కాని బికినీ. పూర్తి బికినీలో కనిపించినా సమస్య లేదు, కానీ ఆమె ధరించిన డ్రెస్ వింతగా ఉంది. దాన్ని కాప్చర్ చేసిన నెటిజన్లు ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తమన్నా ఇంతగా తెగిస్తుందని ఆశ్చర్యపోతున్నారు. ఇదేం ఆరాచకం అంటున్నారు.
`లస్ట్ స్టోరీస్`, `జీ కద్రా`లో బోల్డ్ సీన్లు చేసిన తమన్నా
గతంలోనూ తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. `లస్ట్ స్టోరీస్ 2`లో బోల్డ్ సీన్లు చేసింది. దీంతోపాటు `జీ కద్రా` వెబ్ సిరీస్‌లో మరింతగా రెచ్చిపోయింది. ఇందులో తమన్నాని చూసి తెలుగు ఆడియెన్స్ షాక్ అయ్యారు. మిల్యీ బ్యూటీ ఇంతగా తెగిస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆఫర్ల కోసం ఇంతగా దిగజారాలా అని కామెంట్స్ చేశారు. బాగా ట్రోల్స్ చేశారు. ఇప్పుడు `గఫూర్` సాంగ్‌తో మరోసారి ట్రోల్ కి గురవుతుంది తమన్నా. ఇక పూర్తి పాట వస్తే రచ్చ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. తమన్నా ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.