MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • నటుడుగా తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే?

నటుడుగా తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే?

తరుణ్ భాస్కర్ నటన వేసుకోవడం కొత్తేమి కాదు. మంగళవారం స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసినప్పుడే అందరి దృష్టినీ ఎట్రాక్ట్ చేసారు. అంతకు ముందు మీకు మాత్రమే చెప్తాలో హీరోగా నటించాడు. 

3 Min read
Author : Surya Prakash
Published : Apr 22 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tharun Bhasker

Tharun Bhasker


న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ గా  తనదైన ప్రతిభను చాటుకుంటున్నారు తరుణ్‌భాస్కర్‌. ఆ తర్వాత ఆయన నటుడుగానూ తనదైన శైలిలో కీడా కోలాలో నటించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. సంజీవ్‌ ఏఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తరుణ్‌భాస్కర్‌ సరసన ఈషారెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని రీసెంట్ గా  అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


మొదటి చిత్రం పెళ్లి చూపులు దర్శకుడుగా తరుణ్ భాస్కర్ ని యూత్ కు దగ్గర చేసింది. తనకే కాదు విజయ్ దేవరకొండకూ చక్కని లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడింది. తక్కువ బడ్జెట్ లో ఇచ్చిన కూల్ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన  ఈ నగరానికి ఏమైంది. రిలీజైన టైంలో అద్భుతాలు చేయలేదు రీరిలీజ్ టైమ్ లో దుమ్ము రేపింది. కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన కీడా కోలా బాగుందనిపించుకుంది కానీ జస్ట్ ఓకే అనిపించుకుంది. 

37

ఇప్పుడు  తరుణ్ భాస్కర్ ఎక్కువ నటన వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తను 2022లో వచ్చిన మలయాళం హిట్ మూవీ జయ జయ జయహే రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. దీని షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది. తెలుగు డబ్బింగ్ తో సహా ఓటిటిలో అందుబాటులో ఉన్న మూవీని మళ్ళీ తీయడమంటే కంటెంట్ మీద నమ్మకమే అంటున్నారు. 

తరుణ్ భాస్కర్: పెళ్లి చూపులు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న తరుణ్ ఆ తరువాత డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తరుణ్ భాస్కర్: సైన్మా షార్ట్ ఫిల్మ్ తో యూ ట్యూబ్ లో పాపులరైన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ని ఆకర్షించే విధంగా హిట్టందుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను కూడా తరుణ్ డైరెక్ట్ చేశాడు.

47
tarun bhaskar

tarun bhaskar


ఇక తరుణ్ భాస్కర్ నటన వేసుకోవడం కొత్తేమి కాదు. మంగళవారం స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసినప్పుడే అందరి దృష్టినీ ఎట్రాక్ట్ చేసారు. అంతకు ముందు మీకు మాత్రమే చెప్తాలో హీరోగా నటించాడు. సీతారామం లాంటి వాటిలో సపోర్టింగ్ రోల్  వేశాడు. యాంకర్ గానూ ట్రై చేశాడు.  ఇప్పుడు ఈ చిత్రం చేస్తున్నాడు. మరో చిత్రం లో కూడా హీరోగా కమిటయ్యారని సమాచారం.

57


ఇక సినిమాకు యాభై లక్షలు దాకా తరుణ్ భాస్కర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.  జయ జయ జయహే రీమేక్ పై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తరుణ్ భాస్కర్ కు చాలా ఆఫర్స్ వచ్చినా ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. ఏ సినిమా పడితే అది ఒప్పుకోవటం లేదు. మంచి స్క్రిప్టు వచ్చే దాకా వెయిట్ చేస్తున్నారు.  

67
Tharun bhascker

Tharun bhascker


జ‌య జ‌య జ‌య జ‌య‌హే మూవీ 2022లో మ‌ల‌యాళం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి విపిన్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ మూవీలో జ‌య పాత్ర‌లో ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ త‌న యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. భ‌ర్త పెట్టే చిత్ర‌హింస‌ల‌ను భ‌రించ‌లేక అత‌డిపై ఎదురుతిర‌గే భార్య పాత్ర‌లో ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 45 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు ప‌దింత‌ల లాభాల‌ను మిగిల్చింది.

77
Tharun bhascker

Tharun bhascker


 జయ జయ జయహే రీమేక్  సినిమాలో తరుణ్‌భాస్కర్‌, ఈషారెబ్బా రూరల్‌ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుతున్నామని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్‌, సంగీతం: జైక్రిష్‌, నిర్మాతలు: సృజన్‌ యరబోలు, వివేక్‌ కృష్ణని, సాధిక్‌, ఆదిత్య, దర్శకత్వం: సంజీవ్‌ ఆర్‌.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved