- Home
- Entertainment
- మా చదువు కోసం అమ్మ నాన్ననే వదిలేసింది.. నా జీవితంలో హీరో సావిత్రినే.. తనూజ కన్నీళ్లు
మా చదువు కోసం అమ్మ నాన్ననే వదిలేసింది.. నా జీవితంలో హీరో సావిత్రినే.. తనూజ కన్నీళ్లు
బిగ్ బాస్ తెలుగు 9 శుక్రవారం ఎపిసోడ్‌లో తనూజ తన చిన్నప్పటి జీవితాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు తనూజని భరణి ఎత్తుకున్నందుకు ఆయనపై దివ్య అలిగింది.

గుండె బరువెక్కించే తనూజ బాల్యం
బిగ్ బాస్ తెలుగు 9 లో శుక్రవారం చైల్డ్ వుడ్ జ్ఞాపకాలు పంచుకునే ఎపిసోడ్ సాగింది. బాలల దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ ఈ ప్లాన్ చేశారు. అందరికి వారి చిన్నప్పటి ఫోటోలు ఇచ్చి, వాటి వెనుక కథ చెప్పమన్నారు. అందులో భాగంగా ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, కళ్యాణ్ గుండెని బరువెక్కించారు. మరోవైపు తనూజ సైతం కన్నీళ్లు పెట్టించింది. తాను ఎమోషనల్ అయ్యింది. ఆమె మొదటిసారి కెప్టెన్ అయిన నేపథ్యంలో ఆ ఆనందంలో తన చిన్నప్పటి విషయాలను పంచుకుంది.
తమకి చదువు వద్దని చెప్పిన నాన్న
తమ పేరెంట్స్ కి తాము ముగ్గురం ఆడపిల్లలమని, ముగ్గురూ అమ్మాయిలే కావడంతో పెంచడం ఇబ్బంది అవుతుందని, ఫ్యామిలీలో తలా ఓ మాట అనేవారట. ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని, ఏదైనా తేడా వస్తే పరువు పోతుందని రిలేటివ్స్ అంటుండేవారట. దీంతో ఇది మనుసుకి తీసుకున్న తనూజ నాన్న వాళ్లకి చదువు వద్దు, త్వరగా పెళ్లి చేసి పంపించాలని అనేవాడట. చదవ నిచ్చేవాడు కాదట. ఇలా అయితే పిల్లల లైఫ్ పాడవుతుందని అమ్మ ఎంతో శ్రమించిందట. ఎవరికీ తెలియకుండా చిన్నమ్మాయిని అమ్మమ్మ వద్దకు పంపించిందట తనూజ అమ్మ. ఆ తర్వాత తనని, చెల్లిని తీసుకుని హైదరాబాద్‌కి వచ్చేసిందట.
మా చదువు కోసం నాన్నని వదిలేసిన అమ్మ
తమ చదువుల కోసం నాన్నని వదిలేసి ఒంటరిగానే హైదరాబాద్ వచ్చిందని, ఇక్కడ పని చేస్తూ తమని చదివించిందని తెలిపింది తనూజ. కొన్నాళ్లపాటు ఎవరికీ తెలియకుండా ఇక్కడే పెరిగామని, ఆ తర్వాత తమ గురించి తెలుసుకుని, ఫ్యామిలీలో అందరిని ఒప్పించి నాన్న ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది. అంతేకాదు, చాలా విషయాలు తన వల్ల కాదని అనుకున్నప్పుడు నువ్వు చేయగలవు అని ధైర్యాన్నిచ్చి, చేసేలా ప్రోత్సహించిందని, తనవెంటే నిలబడిందని, తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే దానికి అమ్మనే కారణం అని చెప్పింది. తన జీవితంలో అమ్మనే హీరో అంటూ `నా సావిత్రినే నా హీరో` అని తెలిపింది తనూజ. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి గురయ్యింది.
తనూజ కారణంగా భరణిపై అలిగిన దివ్య
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో పదోవారం తనూజ కెప్టెన్ అయ్యింది. ఈ సందర్భంగా భరణి ఆమెని ఎత్తుకున్నాడు. ఇది చూసిన దివ్య నిలదీసింది. తాను కెప్టెన్ అయినప్పుడు నన్ను ఎత్తుకున్నావా? అంటూ ప్రశ్నించింది. ఆమెని ఎత్తుకున్నావ్ కదా, మరి నన్ను ఎందుకు ఎత్తుకోలేదంటూ అలిగింది. ఆమె క్లోజ్, నువ్వు కాదని భరణి చెప్పడంతో దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా సుమన్ శెట్టి, భరణి ల మధ్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈఎపిసోడ్ చివర్లో ఇమ్మాన్యుయెల్ చేసిన కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది.