MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నాన్న నన్ను వద్దు అనుకున్నాడు.. ఇమ్మాన్యుయెల్‌ ఎమోషనల్‌.. వాడే మీ జీవితాన్ని మార్చేదని అమ్మమ్మ చెప్పడంతో

నాన్న నన్ను వద్దు అనుకున్నాడు.. ఇమ్మాన్యుయెల్‌ ఎమోషనల్‌.. వాడే మీ జీవితాన్ని మార్చేదని అమ్మమ్మ చెప్పడంతో

ఇమ్మాన్యుయెల్‌ బిగ్‌ బాస్‌ షోలో నవ్వులు పూయిస్తున్నారు. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్నాడు. కానీ ఈ రోజు మాత్రం కన్నీళ్లు పెట్టించాడు. తన చిన్నప్పటి జీవితాన్ని చెప్పి హౌజ్‌లో అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 14 2025, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్నప్పటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌గా మారిన బిగ్‌ బాస్‌ హౌజ్‌
Image Credit : starmaa

చిన్నప్పటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌గా మారిన బిగ్‌ బాస్‌ హౌజ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 శుక్రవారం(68వ) ఎపిసోడ్‌ లో కంటెస్టెంట్ల చిన్ననాటి మెమొరీస్‌ గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు బిగ్‌ బాస్‌. చిల్డ్రన్స్ డే స్పెషల్‌ గా దీన్ని ప్లాన్‌ చేశారు. అందులో భాగంగా కంటెస్టెంట్ల చిన్నప్పటి ఫోటోలను తెప్పించారు. వాటిని కంటెస్టెంట్లకి ఇచ్చి ఆ ఫోటో వెనుక స్టోరీని పంచుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో ఒక్కొక్కొరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. కొందరివి రెగ్యూలర్‌గా ఉంటే, మరికొందరివి ఫన్నీగా, ఇంకొందరివి ఎమోషన్‌గా ఉన్నాయి. అందులో భాగంగా ఇమ్మాన్యుయెల్‌ చిన్ననాటి జీవితం ఆద్యంతం బాధాకరంగా సాగడం గమనార్హం. అన్నయ్య, తాను ఒకే డ్రెస్‌ ధరించడంపై ఆయన చెబుతూ, అన్నయ్యకి ఏ డ్రెస్‌ కోనిస్తే, తనకు కూడా అదే కోనివ్వమని అడిగేవాడిని, లేదంటే గొడవ చేసేవాడిని అని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నన్ను కనొద్దని నాన్న ఫోర్స్ చేశాడు
Image Credit : starmaa

నన్ను కనొద్దని నాన్న ఫోర్స్ చేశాడు

ఈ సందర్భంగా చిన్నప్పటి దారుణమైన పరిస్థితులను వెల్లడించాడు ఇమ్మూ. తాను‌, డానియల్‌ అన్నదమ్ములు. తాను పుట్టే సమయంలో వీరి పేరెంట్స్ కఠిక పేదరికంలో ఉన్నారు. చిన్నపాకలో ఉండేవారట. తినడానికి తిండికూడా లేదు. అప్పటికే పెద్దబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్‌ కడుపులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న తనని వద్దు అనుకున్నాడట. ఒక్కడినే సరిగా చూసుకోలేకపోతున్నాం, ఇంకొక్కరు అంటే కష్టమవుతుంది. వద్దు అన్నారట. అమ్మని చాలా ఫోర్స్ చేశారట. కానీ అమ్మమ్మ  ఒత్తిడి చేసి ఇమ్మాన్యుయెల్‌ని కనేలా వాళ్ల అమ్మానాన్నల్ని ఒప్పించిందట. అంతేకాదు వీడి వల్లే మీ జీవితాలు మారతాయని కూడా చెప్పిందట. అలా అమ్మమ్మ వల్లనే తాను పుట్టానని తెలిపారు ఇమ్మాన్యుయెల్‌.

Related Articles

Related image1
బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఓటింగ్‌, డేంజర్‌లో ఈ కంటెస్టెంట్లు.. ఈ సారి ఊహించని ఎలిమినేషన్‌
Related image2
పేరెంట్స్ కి బాలయ్య రిక్వెస్ట్.. `అఖండ 2 తాండవం`ని వీళ్లకి చూపించాలట.. సెకండ్‌ ఇన్నింగ్స్ పై కామెంట్‌
35
అమ్మ తిండిలేక మట్టితినేది
Image Credit : starmaa

అమ్మ తిండిలేక మట్టితినేది

ఈ క్రమంలో మరో షాకింగ్‌ విషయాన్ని పంచుకున్నాడు. తాను కడుపులో ఉన్నప్పుడు అమ్మకి ఆకలేస్తే, తినడానికి తిండి లేక పొలంలోకి వెళ్లి మట్టిని తిన్నదని చెప్పాడు. దీంతో హౌజ్‌  ఒక్కసారిగా గుంబనంగా మారిపోయింది. అందరి మనుషులను చలింప చేసింది. ఇంకా ఇమ్మాన్యుయెల్‌ చెబుతూ, చిన్నప్పట్నుంచి కూలీ పనులు చేసుకునేవాళ్లమని, ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పనులు చేసి తమ ఖర్చులకు తామే సంపాదించుకున్నట్టు తెలిపారు. అన్ని రకాల కూలీ పనులు చేసిన్టటు తెలిపాడు. డిగ్రీలో క్యాటరింగ్‌ సర్వీస్‌ కూడా చేసినట్టు తెలిపారు ఇమ్మాన్యుయెల్‌. తాను సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదన్నారు.

45
మూడేళ్లుగా అన్నయ్య సరిగా మాట్లాడటం లేదు
Image Credit : starmaa

మూడేళ్లుగా అన్నయ్య సరిగా మాట్లాడటం లేదు

`సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ అయ్యాక.. గుడిసే ఉన్న చోటనే నాన్న ఇళ్లు కడితే, ఆ తర్వాత దాన్ని పెంచి మూడు ఫ్లోర్స్ వేశాను.  అన్ని అప్పులు కూడా తీర్చుకోగలిగాం. ఇప్పుడు అంతా హ్యాపీ. అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. ఏదైనా పని చేయాల్సి వస్తే, నా పని కూడా తనే చేసేవాడు, తనకు కష్టం రానిచ్చేవాడు కాదు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ గత మూడేళ్లుగా సరిగా మాట్లాడటం లేదు. ఏమైందో ఏంటో తెలియదు. అయితే తాను జబర్దస్త్ లోకి వచ్చాను, మంచి పేరొచ్చింది. ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. ఏదైనా ఆఫర్స్ ఇప్పించొచ్చు కదా అని వాళ్లు వీళ్లు అన్నకి చెబుతుంటారు. మనసు పాడు చేస్తుంటారు. అన్నయ్య విషయంలో అదే జరిగి ఉంటుంది. కానీ ఏ రోజైనా వాడు మంచి డైరెక్టర్‌ అవుతాడు. నాతో సినిమా తీస్తానని అంటుంటారు. అది నెరవేరాలని కోరుకుంటున్నా. అన్నయ్య చాలా మంచివాడు, నేనే దొంగనా కొడుకుని` అంటూ కన్నీళ్లు పెట్టించాడు ఇమ్మాన్యుయెల్‌. ఆయన చిన్నప్పటి స్టోరీ ఆద్యంతం గుండెని బరువెక్కించిందని చెప్పొచ్చు.

55
చిన్నప్పుడు అమ్మనాన్నకి దూరమయ్యాను
Image Credit : starmaa

చిన్నప్పుడు అమ్మనాన్నకి దూరమయ్యాను

ఇమ్మాన్యుయెల్‌తోపాటు రీతూ చౌదరీ, భరణి, నిఖిల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌, కళ్యాణ్‌ కూడా తమ చిన్నప్పటి గుర్తులను నెమరేసుకున్నారు. చిన్నప్పుడు తనని అమ్మమ్మ వద్ద పెంచారని, అమ్మానాన్న ప్రేమకి నోచుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్‌. అలాగే తాను చిన్నప్పుడు అన్నయ్య డ్రెస్సులు, చెప్పులు వేసుకునేదాన్ని అని, తానుఎక్కువగా అబ్బాయిల దుస్తులు ధరించేదాన్ని అని రీతూ చౌదరీ తెలిపింది. మరోవైపు తాను 6వ తరగతిలోనే జిల్లా స్థాయిలో చెస్‌లో విన్నర్‌గా నిలిచినట్టు, చాలా మందికి చెస్‌ నేర్పించేవాడిని అని వెల్లడించారు డీమాన్‌ పవన్‌. ఇలా తమ చిన్నప్పటి విషయాలు చెప్పి ఆకట్టుకున్నాడు కంటెస్టెంట్లు.ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం అలరించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం ఓటింగ్‌, డేంజర్‌లో ఈ కంటెస్టెంట్లు.. ఈ సారి ఊహించని ఎలిమినేషన్‌
Recommended image2
పేరెంట్స్ కి బాలయ్య రిక్వెస్ట్.. `అఖండ 2 తాండవం`ని వీళ్లకి చూపించాలట.. సెకండ్‌ ఇన్నింగ్స్ పై కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved