Thank You Twitter Review: నాగచైతన్య థాంక్యూ మూవీ ట్విట్టర్ రివ్యూ..షార్ట్ ఫిల్మ్ చేయాల్సింది అంటున్న ఆడియన్స్
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా థాంక్యూ. మనం సినిమా తరువాత నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన సినిమా థ్యాంక్యూ... ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 22, 2022 న థియేటర్లలో విడుదలవుతోంది. అంకంటే ముందే యూఎస్ లో ప్రీమిర్స్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమాలు చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూడ్దాం.
ఎట్టకేలక థ్యాంక్యూ మూవీ రిలీజ్ అవ్వబోతోంది యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పడ్డాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అని ఎదురు చూస్తున్న నాగచైతన్యకు థాంక్యూ సినిమా కలిపి వస్తుందా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలా స్పందిస్తున్నారు చూద్దాం.
కథ విషయానికి వస్తే... నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్ నుండి వెళ్లి బిలినియర్ ఎలా అయ్యాడు మరియు ఒక కంపెనీని యజమాని ఎలా అయ్యాడు, అతను ఎప్పుడూ తన సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనుకుంటు బతికేస్తాడు, అయితే ఒక రోజు తన ప్రయాణం మరియు అతని విజయం వెనుక చాలా మంది వ్యక్తుల ఉన్నారని అతను తెలుసుకుంటాడు, అప్పటి నుండి అతను వారి పట్ల తన కృతజ్ఞత చూపాలని నిర్ణయించుకుంటాడు, మరి తను తన కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపిస్తాడు? అనేది సినిమా.
నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి మరియు ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు చెకింగ్ కు వచ్చారు. ఇక ఈసిపిమాకు రచనను BVS రవి మరియు దర్శకత్వం విక్రమ్ K కుమార్, సినిమాటోగ్రఫీని PC నిర్వహించింది. శ్రీరామ్, సంగీతం: తమన్ ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ లో థ్యాంక్యూ మూవీ గురించ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటుననారు అంటే... సినిమా బాగుంది.. నాగచైతన్య అద్భుతం అని కొందరు అంటుంటే... మరికొంత మంది అక్కడక్కడా కొన్ని మైనస్ లు ఉన్నాయి అంటున్నారు.
ఇక థ్యాంక్యూ సినిమాకు రెండు హైలెట్ గా నిలిచాయి.. అవి ఏంటీ అంటే.. తమన్ బీజియం, ఇంకొంకట పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. ఈరెండు ఎలిమెంట్స్ సినిమాకు భాగా ప్లస్ అయ్యాయి అంటున్నారు ట్విట్టర్ జనాలు. ఫస్ట్ హాఫ్ బాగుందని కొందరు, సెకండ్ హాఫ్ బోరింగ్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొంత మంది మాత్రం ఫుల్ పాజిటీవ్ కామెంట్స్ ఇస్తున్నారు. సినిమాబాగుందని, ముఖ్యంగా నాగచైతన్య యాక్టింగ్ అద్భుతం అన్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా పండించారని.. చైతూ లుక్ ఈసినిమాలో పూర్తి భిన్నంగా ఉదన్నారు
ఇక మహేష్ బాబు రిఫరెన్స్ వాడుకోవడం బాగాలేదని కొందరు, దానివల్లే సినిమా నడుస్తుందని మరికొందరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక ఇంకొంత మంది నెటిజన్లు మాత్రం ఈ సినిమా థియేటర్ కు పనికిరాదు అని..ఓటీటీకి అయితే బాగుంటుంది అన్నారు. మరికోందరైతే.. ఇది షార్ట్ ఫిల్మ్ కు అయితే బాగుంటుంది అన్నారు.
ఇలా రకరకాల కామెంట్ లో ట్విట్టర్ ను నింపేశారు ఆడియన్స్. ఇక ఈరోజు థియేటర్లలో ఈసినిమా రిలీజ్ అయింది. చైతూకు ఈ సినిమాతో కాస్తైనా ఇమేజ్ మారుందా లేదా నేది చూడాలి.