తంగలాన్ తో సత్తా చాటాడు.. రాంచరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు..
రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని దిల్ రాజు ప్రకటించారు. ఇదిలా ఉండగా రాంచరణ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. రాంచరణ్ నెక్స్ట్ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కనుంది.
రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని దిల్ రాజు ప్రకటించారు. ఇదిలా ఉండగా రాంచరణ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. రాంచరణ్ నెక్స్ట్ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కనుంది. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రంపై కొన్ని క్రేజీ విషయాలు వినిపిస్తున్నాయి.
స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోంది అని, విజయనగరం స్లాంగ్ లో విలేజ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ని బుచ్చిబాబు కథలో రాసుకున్నారట, వాటిని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడమే మిగిలి ఉంది. ఈ చిత్రం విషయంలో బుచ్చిబాబు ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ కోసం టాప్ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారు.
మ్యూజిక్ కోసం ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ ని ఎంపిక చేశారు. తాజాగా మరో క్రేజీ టెక్నీషియన్ ని ఎంపిక చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే చిత్రానికి కాస్ట్యూమ్స్ చాలా ముఖ్యం. దీనితో కాస్ట్యూమ్ డిజైనర్ గా..తంగలాన్ చిత్రానికి పనిచేసిన ఏకాంబరం అనే కాస్ట్యూమ్ డిజైనర్ ని బుచ్చిబాబు సెలెక్ట్ చేశారు.
విక్రమ్ తంగలాన్ చిత్రానికి ఏకాంబరం అందించిన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రశంసలు దక్కాయి. కాస్ట్యూమ్స్ చాలా సహజ సిద్ధంగా ఉన్నాయని అంతా అభినందించారు. బుచ్చిబాబుకి కూడా ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ తెగ నచ్చేశాయట. దీనితో బుచ్చిబాబు వెంటనే ఏకాంబరం ని ఆర్సీ 16 చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఏకాంబరం సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు తెలుగు సాంప్రదాయాలు కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇలాంటి ఆఫర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా.నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబుకి, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కి కృతజ్ఞతలు అంటూ ఏకాంబరం పోస్ట్ చేశారు.