- Home
- Entertainment
- Thandel Collections: నాగచైతన్య కెరీర్‌లో అరుదైన మైల్ స్టోన్, కలెక్షన్లలో `తండేల్` సరికొత్త రికార్డు
Thandel Collections: నాగచైతన్య కెరీర్‌లో అరుదైన మైల్ స్టోన్, కలెక్షన్లలో `తండేల్` సరికొత్త రికార్డు
నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్` మూవీ అరుదైన మైల్ స్టోన్‌ని చేరుకుంది. ఈ మూవీ వందకోట్ల క్లబ్‌లో చేరి చైతూ లైఫ్ టర్నింగ్ హిట్‌గా నిలిచింది.

thandel movie, Sai Pallavi, naga chaitanya
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ `తండేల్`. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించిన విషయం తెలిసిందే. విడుదలై(ఫిబ్రవరి 7) రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతుంది. కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది.
Sai Pallavi, naga chaitanya
తాజాగా `తండేల్` అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. నాగచైతన్యని టైర్ 2 హీరోల్లో స్థానం కల్పించింది. అంతేకాదు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది.
విడుదలైన రెండు వారాల్లో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. సెకండ్ వీక్ ముగియకముందే, ఓవర్సిసిస్ లో $1 మిలియన్(సుమారు పది కోట్లు) దాటింది. ఓవర్సీస్‌లో చాలా మంది స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లు రావడం విశేషం.
Naga Chaitanya
`తండేల్` మూవీ నాగచైతన్య కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఇన్నాళ్లు ఆయన హిట్ కోసం స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. సరైన బ్రేక్ కోసం స్ట్రగుల్‌అవుతున్నాడు. `మజిలి` తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు.
ఈ క్రమంలో ఇప్పుడు `తండేల్` రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. కెరీర్ పరంగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా ఈ మూవీ చైతూని ఓకేసారి పది మెట్లు ఎక్కించింది. కెరీర్ పరంగా ఆయనకు మరో ఐదారేళ్లు తిరుగులేదని చెప్పొచ్చు.
Thandel Movie Review
నాగచైతన్య కష్టం, అద్భుతమైన నటన, అలాగే సాయిపల్లవి మెస్మరైజ్ చేసే యాక్టింగ్, డాన్సులు, బలమైన కథ, మత్య్సకారుల యదార్థ జీవితాలు, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమాని ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.
దీంతోపాటు దర్శకుడు చందూ మొండేటి సినిమాని ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన తీరు సినిమాకి హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్ కీలక పాత్ర పోషించింది. సినిమాని పెద్ద హిట్ చేసిందని చెప్పొచ్చు.