లండన్ నుండి థమన్ మ్యూజిక్ సర్‌ప్రైజ్.. పవన్ కళ్యాణ్ ఓజీ పై హైప్స్ పెంచేశారుగా..
Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’(OG) చిత్రానికి సంగీతం అందిస్తున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్. తాజాగా మ్యూజిక్ (BGM) కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

మరో మ్యూజికల్ సన్సేషనల్
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘ఓజీ’ (OG). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (OG)సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, సింగిల్స్‌తో సోషల్ మీడియాలో హైప్ పెంచిన మూవీ మేకర్స్ తాజాగా మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటీ?
OG కి థమన్ గ్లోబల్ ట్యూన్
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సక్సెస్ పుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల జపాన్ వాయిద్య పరికరం కోటోని ఉపయోగించి స్పెషల్ బీజీఎం రూపొందించినట్లు వెల్లడించారు. తాజాగా లండన్ నుండి మరో కీలక అప్‌డేట్ షేర్ చేశారు.
117 మ్యూజిషియన్లతో థమన్ సెన్సేషన్
పవన్ కళ్యాణ్ ఓజీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ స్టోర్మ్ క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రసిద్ధ Abbey Road Studiosలో మొత్తం 117 మంది మ్యూజిషియన్లతో కలిసి ఈ సినిమా సంగీతాన్ని రికార్డ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. థమన్ అప్‌డేట్‌తో #HungryCheetah హ్యాష్‌టాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి చేరింది.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025
పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఇప్పటివరకూ చూడని కొత్త లుక్‌లో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అమెరికాలో రికార్డులను బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోనే 50 వేలకుపైగా టికెట్లు ముందుగానే అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు సింగిల్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
త్వరలోనే మూడవ సింగిల్ రాబోతుందని థమన్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, DVV ఎంటర్టైన్‌మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.