పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లలో ఎన్ని కోట్లు సంపాదించారు.. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?
Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ హీరోనే కాదు.. రాజకీయ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ నెట్ వర్త్ ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల వివరాలు
Pawan Kalyan Net Worth: పవన్ కళ్యాణ్ కేవలం సూపర్ స్టార్ హీరో మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాజకీయ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అలాగే.. దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక పవన్ కు ప్రధాన ఆదాయం సినిమాలే. నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ఆస్తులు, పెట్టుబడులు, ఆదాయాల సమగ్ర వివరాల గురించి ఫ్యాన్స్ తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం పవన్ కళ్యాణ్ నెట్‌వర్త్, ఆస్తుల వివరాలను చూద్దాం.
సినీ పరిచయం
కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించి, వివిధ అవార్డులు కూడా గెలుచుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత పవన్ తన నటన, స్టైల్, మేనరిజంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి తెలుగు సినీ రంగంలో మెగాస్టార్‌గా ఎదిగినట్లే, పవన్ కూడా పవర్ స్టార్‌గా ప్రత్యేక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు.
ప్రత్యేక స్టార్ డమ్
పవన్ కళ్యాణ్ 1996లో సత్యనారాయణ దర్శకత్వంలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో వెండితెరపై ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. తన ముప్పై ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. అంటే సుమారు యేడాదికి ఒక్కో సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
‘గోకులంలో సీత’, ‘తొలి ప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషీ’, ‘జానీ’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను సుస్థిరం చేసాయి. ప్రత్యేకంగా 1999లో వచ్చిన ‘తొలి ప్రేమ’ సినిమా జాతీయ అవార్డు, ఆరు నంది అవార్డులను తెచ్చిపెట్టింది. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చారు. అతి తర్వలో ‘ఓజీ’సినిమాతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నారు.
రాజకీయ ప్రవేశం
తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ రాజకీయాలపై మంచి అవగాహన కలిగిన పవన్ కళ్యాణ్ 2008లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల పవన్ నొచ్చుకున్నారు. తన నమ్మిన సిద్ధాంతాలు, భావజలానికి అనుగుణంగా 2014లో సొంతంగా ‘జనసేన’ పార్టీని స్థాపించి రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ పార్టీ ద్వారా రాజకీయ రంగంలో మరింత గుర్తింపు సంపాదించారు.
పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం
2019లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయ సమస్యలపై పోరాటం సాగించారు. 2024లో జనసేన, బీజేపీ, టీడీపీతో కూటమిగా పోటీ చేసి 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు చేపట్టారు. జనసేన పార్టీ అధినేతగా తీరిక లేకుండా పని చేస్తూ, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటించారు. వీరమల్లు ఇప్పటికే రిలీజ్ కాగా, సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ కానుంది.
పవన్ ఆస్తులు, అప్పులు:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెట్‌వర్త్ విషయానికి వస్తే.. రూ. 125 కోట్ల నుంచి రూ. 140 కోట్లు మధ్య ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ MLA నామినేషన్ అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తులు రూ. 164 కోట్లు కాగా.. అందులో సుమారు ₹65 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదాయం ప్రధానంగా మూడు మార్గాల ద్వారా వస్తుంది: సినిమా పారితోషికం, రాజకీయ ఆదాయం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.
సినిమా పారితోషికం ఒక్కో సినిమాలో సుమారు రూ50 నుంచి రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పవన్ కు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. విజయవాడ ఇంటి ధర రూ. 16 కోట్లు, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఇంటి విలువ రూ. 12 కోట్లు, బంజారాహిల్స్‌లోని ఒక ఫ్లాట్ ధర రూ. 1.75 కోట్లు. తాజా పరిస్థితులు, అప్పులు, రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడులు, వ్యక్తిగత ఆస్తులను కలుపుకుంటే ఈ అంకెలు మారవచ్చు.