MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ కి బెస్ట్ మ్యూజిక్ ఇద్దాం అనుకున్నా, మధ్యలోనే తొలగించారు.. తమన్ ఆవేదన, ఏ మూవీ అంటే..

ప్రభాస్ కి బెస్ట్ మ్యూజిక్ ఇద్దాం అనుకున్నా, మధ్యలోనే తొలగించారు.. తమన్ ఆవేదన, ఏ మూవీ అంటే..

తమన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ మధ్యలో ఉండగా తొలగించిన సందర్భాలు ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించారు. తమన్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ చిత్రానికి ఒకసారి అలా జరిగింది అని తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 19 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సంగీత దర్శకుడు తమన్ మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇటీవల తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను షర్ట్ వేసుకుని తిరగడం లేదని.. స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నట్లు చమత్కరించారు. సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీత దర్శకుడు తమన్ కావడం విశేషం. డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ కాగా గేమ్ ఛేంజర్ నిరాశ పరిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Thaman

Thaman

అనవసరమైన ట్రోలింగ్ తో మంచి సినిమాలని కూడా చంపేసుకుంటున్నాం అంటూ తమన్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ చిత్రంపై జరిగిన ట్రోలింగ్ ని ఉద్దేశించి తమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమన్ చాలా ఆవేదనతో మాట్లాడిన మాటలకు చిరంజీవి కూడా స్పందించారు. తమన్ ఆవేదన తనని కదిలించింది అని చిరు పేర్కొన్నారు. ఎవరైనా ఎలాంటి అభిప్రాయం అయినా చెప్పొచ్చు. కానీ అది పాజిటివ్ గా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అని చిరంజీవి అన్నారు. 

35

ఇదిలా ఉండగా తమన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ మధ్యలో ఉండగా తొలగించిన సందర్భాలు ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించారు. తమన్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ చిత్రానికి ఒకసారి అలా జరిగింది అని తెలిపారు. ప్రభాస్ నటించిన రెబల్ చిత్రానికి ఆ విధంగా జరిగిందని తమన్ తెలిపారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ తెరకెక్కింది. 

45

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ని ఎంపిక చేశారు. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నాయి. కానీ అనుకోకుండా నన్ను తొలగించారు. ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదు. ప్రభాస్ కాంబినేషన్ లో నా ఫస్ట్ మూవీ అది. ప్రభాస్ కోసం బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలని చాలా ప్రిపేర్ అయ్యా. కానీ నన్ను సినిమా నుంచి తీసేసారు అని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

55

ఆ టైంలో లారెన్స్ కి, తమన్ కి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తమన్ ని తప్పించిన తర్వాత సంగీత బాధ్యతలని కూడా లారెన్స్ తీసుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంలో పాటు సంగీత దర్శకత్వం కూడా లారెన్సే చేశారు. సినిమా డిజాస్టర్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved