MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనిరుధ్ కాదు, తమన్ కి లక్కీ ఛాన్స్.. స్టార్ హీరో కొడుకు తొలి చిత్రానికి రంగం సిద్ధం

అనిరుధ్ కాదు, తమన్ కి లక్కీ ఛాన్స్.. స్టార్ హీరో కొడుకు తొలి చిత్రానికి రంగం సిద్ధం

నటుడు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 21 2024, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జాసన్ సంజయ్, అనిరుద్

జాసన్ సంజయ్, అనిరుద్

విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన కొడుకు జాసన్ సంజయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నందున తన 69వ సినిమా తర్వాత సినిమాల్లో నటించనని ప్రకటించారు. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇటీవల విజయ్ నిర్వహించిన తన పార్టీ తొలి సమావేశానికి 8 లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో ఆయన రాజకీయ ప్రవేశం ఘనంగా మొదలైంది.

24
విజయ్ కొడుకు జాసన్ సంజయ్

విజయ్ కొడుకు జాసన్ సంజయ్

విజయ్ తన కొడుకు జాసన్ సంజయ్ ని హీరోగా చూడాలని కోరికగా ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది దర్శకులతో కథలు కూడా విన్నారు. ముఖ్యంగా 'ప్రేమమ్' దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ జాసన్ సంజయ్ కోసం ఒక కథ కూడా సిద్ధం చేశారు. కానీ సంజయ్ నటనపై ఆసక్తి చూపించకపోవడంతో విజయ్ కూడా కొడుకు ఇష్టాన్ని గౌరవించారు.

 

34
జాసన్ సంజయ్ తొలి సినిమా

జాసన్ సంజయ్ తొలి సినిమా

గత ఏడాది విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్లు, ఆయన తొలి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన వచ్చి ఏడాది దాటినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. సినిమాలో నటించడానికి హీరో దొరకక ఇబ్బంది పడిన జాసన్ సంజయ్ చివరికి నటుడు సందీప్ కిషన్ ని ఎంచుకున్నారు.

44
తమన్

తమన్

జాసన్ సంజయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో విజయ్ నటించిన 'వారసుడు' చిత్రానికి సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు డిసెంబర్ లో వెల్లడి కానున్నాయి.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: వివాదాలను దాటి దూసుకెళ్తున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌ రచ్చ చేస్తోందిగా?
Recommended image2
VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?
Recommended image3
Nayanthara: షూటింగ్ స్పాట్‌లో నయనతార డిమాండ్స్ ఏంటో తెలుసా ? స్టార్ హీరోయిన్ క్యారవాన్ లో హీరోలను మించి సౌకర్యాలు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved