జానీ మాస్టర్ వివాదం: ఫిలిం ఛాంబర్ తీసుకున్న యాక్షన్ ఏమిటంటే
మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి వివరాలు మేం గోప్యంగా ఉంచుతాం.
choreographer Shaik Jani Basha aka jani master accused of sexually abusing woman
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే . తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా డాన్సర్ రెండు రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపారు. కేసును నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు.
నార్సింగి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.తాజాగా జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. తమ్మారెడ్డి భరద్వాజ్, ఝాన్సీతో పాటు ప్యానెల్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
Jani Master
ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. వేధింపులు ఎదుర్కొన్న సమయంలో ఆ అమ్మాయి మైనర్. ఆమెకు న్యాయ సహాయం అవసరం.
Jani Master
అలాగే ఇద్దరి తరఫున వాదనలు విన్నాం. 90 రోజల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి వివరాలు మేం గోప్యంగా ఉంచుతాం. అందుకే ఈ అమ్మాయి వివరాలను కూడా బయటకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాం’ అని ఝాన్సీ అన్నారు.
అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని ఝాన్సీ స్పష్టం చేశారు.
Jani Master
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.....‘ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టాం. 2018లో ప్యానల్ పెట్టాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉంటారని తెలియజేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. 90 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచిస్తాం. మీడియా సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Jani Master
మరో ప్రక్క కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయంపై..పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. " నిందితుడు ‘షేక్ జానీ’ని ఇకపై..జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు..'మాస్టర్' అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ వేసింది. దీంతో పూనమ్ కౌర్ ట్విట్టర్ X లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పూనమ్ ట్వీట్‌కు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు.
తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi sripada) స్పందించింది. చిన్మయి పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయికి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.