MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba:ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న తెలుగు బ్యూటీ ఈషా... టాప్ టు బాటమ్ సాలిడ్ అందాల ప్రదర్శన

Eesha Rebba:ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న తెలుగు బ్యూటీ ఈషా... టాప్ టు బాటమ్ సాలిడ్ అందాల ప్రదర్శన

కైపెక్కించే గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది ఈషా రెబ్బా (Eesha rebba). తెలుగు భామ తెగింపుకు జనాలు షాక్ అవుతుంటే అందాల ఆరాధకులు కళ్లారా ఆస్వాదిస్తున్నారు. గ్యాప్ లేకుండా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్న ఈషా, తన యవ్వనాల జడిలోలో ముంచేస్తుంది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 12 2022, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది ఈషా రెబ్బా.  స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ కనుమరుగయ్యాయి.  అందం, అభినయం ఉండి  కూడా, కెరీర్ లో  ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్షత కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.

28

బాలీవుడ్ హీరోయిన్స్ స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటూ ఉంటుంటే, ఈషా లాంటి తెలుగు అందాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు.

38

సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కుతున్నాయి. ఎన్టీఆర్  (NTR) అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెకు కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా, ఈషాకు వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.

48

అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది.

58


టాలీవుడ్ లో బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే, కోలీవుడ్ లో మూవీస్ చేస్తున్నారు ఈషా. ఈషా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కనీసం కోలీవుడ్ లో అయినా బ్రేక్ వస్తుందేమోనని, ఆ చిత్రాలపై ఆశలు పెట్టుకున్నారు.

68

తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలో కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.

78

మరో వైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ, దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు. తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది ఈషా. సూపర్ స్టైలిష్ గా ఉన్న ఈషా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారడం జరిగింది. మరి ఈషా ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

88


ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో నటులకు డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్లు, సినిమాలు విరివిగా తెరకెక్కుతుండగా ఈషా లాంటి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ మధ్య విడుదలైన పిట్ట కథలు యాంథాలజీ సిరీస్ లో ఈషా నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Recommended image2
Ram Charan : చిరంజీవి కొడుకుగా పుట్టడం భారమా? రామ్ చరణ్ కీలక కామెంట్స్
Recommended image3
Renu Desai: నన్ను తిడుతూ కొట్టేందుకు వచ్చాడు.. అందుకే అంతలా అరిచాను
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved