Eesha Rebba: టైట్ సూట్ లో సూపర్ హాట్ పోజులు... తెలుగు భామ ఈషా రెబ్బా మైండ్ బ్లాక్ చేసే అందాలు!
డిజైనర్ సూట్ లో సూపర్ గ్లామరస్ గా మెరిసింది ఈషా రెబ్బా. తెలుగు భామ గ్లామర్ షో విషయంలో తగ్గేదెలా అంటుంది. ఈషా రెబ్బా మోస్ట్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.
Eesha Rebba
ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు.
Eesha Rebba
ఇటీవల ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు.
Eesha Rebba
ఆ మధ్య ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.
Eesha Rebba
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు.
Eesha Rebba
అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.
Eesha Rebba
ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తోంది. ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు.