- Home
- Entertainment
- Ananya Nagalla : ‘నాకు ఇలాంటి భర్తనే కావాలి’.. రిక్వైర్ మెంట్స్ చెప్పిన అనన్య నాగళ్ల.. ఏంటో తెలుసా?
Ananya Nagalla : ‘నాకు ఇలాంటి భర్తనే కావాలి’.. రిక్వైర్ మెంట్స్ చెప్పిన అనన్య నాగళ్ల.. ఏంటో తెలుసా?
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Ananya Nagalla
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Actress Ananya Nagalla) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపైనా సందడి చేస్తోంది.
రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మ ‘తంత్ర’ Tantra మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనకు ప్రశంసలు అందుకుంది. నెక్ట్స్ మరో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
Ananya Nagalla
ఈ క్రమంలో ఆయా షోలకు, ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తోంది. మరోవైపు ఇంట్రెస్టింగ్ అంశాలపై స్పందిస్తోంది. తన వ్యక్తిగత విషయాలనూ నిర్మోహమాటంగా అభిమానులతో పంచుకుంటోంది.
ఈసందర్భంగా అనన్య ‘జబర్దస్త్’ బ్యూటీ రీతూ చౌదరితో ఓ టాక్ షోలో పాల్గొంది. తను అడిగిన ప్రశ్నలకు సూటిగా బదులిచ్చింది. ఈక్రమంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పింది.
తనకు కాబోయే భర్తకు కచ్చితంగా గడ్డం ఉండాలంట. ఇక ఎత్తు, కలర్, మనీ లాంటి విషయాలను పార్టిక్యులర్ ఏం లేదని చెప్పింది. చూడగానే తనను ఇంప్రెస్ చేయగలిగితే చాలని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది.
ఇప్పుడిప్పుడే వరుసగా తెలుగులో అవకాశాలు అందుకున్న అనన్య తన వ్యక్తిగత విషయాలతోనూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నెక్ట్స్ ‘పొట్టేల్’, ‘శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్’ చిత్రాలతో అలరించబోతోంది.