HanuMan : రికార్డు క్రియేట్ చేసిన ‘హనుమాన్’.. యూఎస్ కలెక్షన్లలో సెన్సేషన్.. ఎలాగంటే?
తేజా సజ్జ - ప్రశాంత్ వర్మ కాంబోలోని ‘హనుమాన్’ HanuMan బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఈ చిత్రం యూఎస్ఏలోనూ రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది.
HanuMan USA collections
చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది హనుమాన్ మూవీ (HanuMan Movie). పెద్ద సినిమాలకు పోటీగా సక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మాట నిలబెట్టుకుంటోంది. పైగా టాక్ పరంగా సంక్రాంతి విన్నర్ గానూ నిలించింది.
HanuMan USA collections
మరోవైపు కలెక్షన్లలోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ చిత్రానికి USA Collections కూడా రికార్డు స్థాయిలో అందాయి. యూఎస్ఏలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తాజా కలెక్షన్ల వివరాలు ఆసక్తికరంగా మారాయి.
HanuMan USA collections
ఇక ఈమధ్యనే రూ. 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన ఈ చిత్రం.. ఇంకా స్పీడ్ గా కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా రూ.150 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఇండియాలోనే కాకుండా USAలో షాకింగ్ గా కలెక్షన్లను రాబడుతోంది.
HanuMan USA collections
తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రం యూఎస్ఏలో ఇప్పటి వరకు 4.21 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఐదో సినిమాగా హనుమాన్ రికార్డు క్రియేట్ చేసింది.
HanuMan USA collections
‘హనుమాన్’ కంటే ముందు యూఎస్ఏలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. బాహుబలి -22, ఆర్ఆర్ఆర్ - 14.50, సలార్ - 8.9, బాహుబలి 2 - 8.4మిలియన్ డాలర్స్ సాధించాయి. ఇప్పుడు ఐదో స్థానంలో ‘హనుమాన్’ నిలిచాడు.
HanuMan USA collections
మున్ముందు మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.