- Home
- Entertainment
- 'హను మాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రతి ఒక్క హైలైట్ గురించి చెబుతూ బ్లాక్ బస్టర్ అని తేల్చేశాడు
'హను మాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రతి ఒక్క హైలైట్ గురించి చెబుతూ బ్లాక్ బస్టర్ అని తేల్చేశాడు
యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది.

యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన మరికొన్ని గంటల్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతి సీజన్ కావడంతో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి చిత్రాలతో హను మాన్ కి పోటీ తప్పడం లేదు. హనుమాన్ రిలీజ్ అవుతున్న 12వ తేదీనే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. అయితే హను మాన్ చిత్రంలో సూపర్ హీరో విన్యాసాలు, హనుమంతుడి అద్భుతాలు చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రీమియర్ షోల టికెట్స్ మొత్తం అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా హను మాన్ చిత్రానికి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఏకంగా బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ చిత్రాన్ని వీక్షించి రివ్యూ ఇచ్చారు. హను మాన్ చిత్రాన్ని తరుణ్ ఆదర్శ్ సూపర్ హిట్ అని తేల్చేస్తూ ఈ చిత్రంలో ఉన్న హైలైట్స్ అన్నీ ప్రస్తావించారు. అలాగే హను మాన్ చిత్రానికి 3.5 రేటింగ్ ఇచ్చారు.
Hanu Man
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతమైన ఎంటర్టైనర్ ని అందించారు. హనుమాన్ చిత్రంలో డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ ఎక్స్, మైథలాజి, అదే విధంగా గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలా పక్కాగా కుదిరాయి. ఇక క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది.
అదేవిధంగా ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా పెర్ఫామెన్స్ తో మరో స్థాయికి వెళ్ళాడు. వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రత్యేకమైన నటనతో మార్క్ వదిలింది. విలన్ వినయ్ రాయ్ నటన కూడా బావుంది. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ ప్రధాన పాత్ర పోషించాయి అని తరుణ్ ఆదర్శ్ అభినందించారు. ఫస్ట్ హాఫ్ లో కాస్త నిడివి ఎక్కువైంది అదొక్కటే మైనస్ అని తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ నుంచి హను మాన్ చిత్రానికి ఇలాంటి రివ్యూ రావడం మంచి జోష్ ఇచ్చే అంశమే అని చెప్పొచ్చు. తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి తప్పనిసరిగా పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరగబోతోందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.