KeedaaColaReview:కీడా కోలా ట్విట్టర్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ మూవీ నెక్స్ట్ లెవల్ అని కొందరు, మరికొందరేమో
కీడా కోలా నేడు గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ట్విట్టర్ లో ఆడియన్స్ కీడా కోలా చిత్రానికి సంబంధించిన హైలైట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో సైతం నటించారు. చైతన్య, రాగ్ మయూర్, జీవన్ కుమార్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. కతరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు తెరకెక్కించింది రెండు చిత్రాలే. అయినప్పటికీ తన చిత్రాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకున్నారు. దీనితో కీడా కోలా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కడం మరో విశేషం. కీడా కోలా నేడు గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
ఆల్రెడీ ఈ చిత్ర ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ట్విట్టర్ లో ఆడియన్స్ కీడా కోలా చిత్రానికి సంబంధించిన హైలైట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం నిడివి కేవలం 2 గంటలు. ప్రధాన పాత్రల పరిచయం వైవిధ్యంగా సాగుతుంది. బ్రహ్మానందం తన మనవడు చైతన్య రావు పెళ్లి కోసం చేసే ప్రయత్నాలతో చిత్రంలో కామెడీ మొదలవుతుంది.
ఫస్ట్ హాఫ్ చాలా బావుందని ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. జీవన్ కుమార్ నటన, వివేక్ సాగర్ బిజియం సినిమాలో హైలైట్స్ అని చెబుతున్నారు. ఇక తరుణ్ భాస్కర్ పాత్ర కూడా కిరాక్ అనిపించేలా ఉందని అంటున్నారు.
అసలైన కథని దర్శకుడు ఇంటర్వెల్ సన్నివేశం ముందే రివీల్ చేశాడు. దీనితో ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ముగిసింది.ఇక కీడా కోలా చిత్రం సెకండ్ హాఫ్ మరింత ఫన్ మూమెంట్స్ తో ఉంటుంది. ట్విట్టర్ లో ఆడియన్స్ క్లైమాక్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు.
చాలా సన్నివేశాలని వివేక్ సాగర్ సంగీతం ప్రాణం పోసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో సన్నివేశాలని బ్యాగ్రౌండ్ సంగీతమే ఎలివేట్ చేసింది. అయితే కొందరు ఆడియన్స్ ట్విట్టర్ లో కీడా కోలా చిత్రం బోరింగ్ గా ఉందని పోస్ట్ లు చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ నుంచి ఇది ఊహించలేదు. చాలా సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించినట్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరో నెటిజన్ పోస్ట్ చేస్తూ తరుణ్ భాస్కర్ హిట్స్ అవుట్ ఆఫ్ ది పార్క్ అని కామెంట్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జీవన్ కుమార్ పెర్ఫామెన్స్ అదుర్స్. వివేక్ సాగర్ సంగీతం మరో ప్లస్ పాయింట్ అని పోస్ట్ చేస్తున్నారు.
ఓవరాల్ గా కీడా కోలా చిత్రం అబౌ యావరేజ్ నుంచి వన్ టైం వాచ్ అన్నట్లుగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా మొదలైన కథ, పూర్తిస్థాయిలో కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు లేకపోవడం కీడా కోలాలో మైనస్ ట్విట్టర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది.