MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: వేలకోట్ల ఆస్తి, అవినీతి ఆరోపణలు ? చివరికి మిగిలింది 100 కోట్లు..చిరంజీవితో ముడిపెడుతూ

Chiranjeevi: వేలకోట్ల ఆస్తి, అవినీతి ఆరోపణలు ? చివరికి మిగిలింది 100 కోట్లు..చిరంజీవితో ముడిపెడుతూ

దాసరి నారాయణ రావు ఆస్తుల గురించి తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో ముడిపెడుతూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 27 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dasari Narayana Rao
Image Credit : Asianet News

Dasari Narayana Rao

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. దాసరి నారాయణరావు మరణం తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత చిరంజీవిని చాలా మంది ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు. కానీ మరికొంత మంది అంగీకరించడం లేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతూ ఉంది. కానీ చిరంజీవి మాత్రం తనకి తోచిన విధంగా ఇండస్ట్రీకి సాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణ రావు
Image Credit : Asianet News

ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణ రావు

అయితే తమ్మారెడ్డి భరద్వాజ గతంలో దాసరి, చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో దాసరి గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టారు. ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణ రావు అని, చిరంజీవి కాదు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది.

35
ఆయన పేరు కూడా ఎత్తలేదు
Image Credit : Pinterest

ఆయన పేరు కూడా ఎత్తలేదు

దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తమ్మారెడ్డి బదులిచ్చారు. నేను దాసరి గురించి చెప్పిన మాట వాస్తవం. కానీ చిరంజీవి గారిని ఏమీ అనలేదు. ఆయన పేరు కూడా ఎత్తలేదు. కానీ మీడియా వాళ్ళు రాసేశారు. నేను చాలా సీరియస్ గా చెబుతున్నా. నేను చిరంజీవిని ఏమీ అనలేదు. ఇండస్ట్రీ పెద్ద అనే పదం గురించి ఒక విషయం చెప్పాలి. అది అసలు పదవి కాదు. దాసరి గారు చేసిన మంచి పనుల వల్ల ఇండస్ట్రీని ఆయన్ని పెద్దగా భావించారు.

45
దాసరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు
Image Credit : social media

దాసరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు

ప్రతి రోజూ ఆయన ఇంటిముందు వందల మంది ఉండేవారు. వాళ్లందరికీ రోజూ కాఫీలు, టీలు, భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఆయన ఆస్తి మొత్తం కరిగిపోయింది ఆ విధంగానే. దాసరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వేలకోట్ల అవినీతి చేశారు అంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన నిజంగా అంత అవినీతి చేసి ఉంటే ఆస్తులన్నీ ఏమయ్యాయి ? ఆయన చనిపోయే సమయానికి ఆయన వద్ద ఉన్న ఆస్తులు కేవలం 100 కోట్లు లోపు మాత్రమే.

55
గుప్త దానాలు
Image Credit : social media

గుప్త దానాలు

దానిని కూడా 30 కోట్ల చొప్పున తన ముగ్గురు పిల్లలకు పంచేశారు. పంచాయతీలు చేసి చాలా సమస్యలు పరిష్కరించారు. ఆయన ఏ లాభం చూసుకోకుండా ఇవన్నీ చేశారు. అందుకే ఆయన్ని అందరూ ఇండస్ట్రీ పెద్దగా భావించారు. ఆయన గుప్త దానాలు కూడా చాలా చేశారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా వారి వారి స్థాయిలలో మంచి పనులు చేస్తున్నారు. కానీ దాసరిలా ఎవరూ చేయలేరు అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image2
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image3
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Related Stories
Recommended image1
Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి
Recommended image2
OTT Movies: గోల్డ్ స్మగ్లింగ్ పై పోరాడిన అధికారి, ఈ వారం ఓటీటీలో కళ్ళు చెదిరే సినిమాలు.. నిహారిక రాకాస కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved