భర్త పోయిన బాధలో ఉన్నా.. వేధించకండి.. నటి శ్రుతి షణ్ముగ ప్రియ ఆవేదన..
అసలే బాధలో ఉన్నాను.. భర్తపోయి కుమిలిపోతున్నాను.. ఈ టైమ్ లో నన్ను వేధించడం న్యాయం కాదు అంటోంది..ప్రముఖం తమిళ సీరియల్ నటి శ్రుతి షణ్ముగ ప్రియ. రీసెంట్ గా తన ఆవేదనను వెల్లడించింది తమిళ నటి.

sruthi shanmuga priya
ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీని విషాదాలు సునామీలా ముంచెత్తుతున్నాయి. భాషతో సబంధం లేకుండా ఇండస్ట్రీకి సబంధించిన ఎంతో మంది సినిమా తారలు నేల రాలుతున్నారు. వరుసగా ఏవో విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలు మరణిస్తూనే ఉన్నారు. వారి మరణంతో కుటుంబాలకు తీరని శోకం మిగులుతుంది అభిమానులకు తీరని బాధ మిగులుతుంది.
sruthi shanmuga priya
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళ బుల్లితెర నటి జీవితంలో జరిగింది. తమిళ సీరియల్స్ లో నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది శృతి షణ్ముగప్రియ.. నటస్వరం సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయిన ఈనటి భర్త అరవింద్ గుండెపోటుతో కన్నుమూశారు. అయితే వీరి పెళ్ళి జరిగి ఎంతో కాలం కావడం లేదు. లాస్ట్ ఇయర్ అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శృతి షణ్ముగప్రియ.
sruthi shanmuga priya
అయితే చాలా కాలంగా ఈ కపుల్ డేటింగ్ లో ఉన్నారు. కొన్ని రోజులుగా సహజీవనంచేస్తూ.. పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మలుచుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో అరవింద్ మరణం ఆమెను సుడిగుండంలోకి తోసినట్టుగా అయిపోయింది. దానికి తోడు సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ఆమెను ఇంకా కలచివేస్తున్నాయి. ఈ విషయంలో తాజాగా స్పందించింది షణ్ముగప్రియ.. చాలా ఎమోషనల్ అవుతూ.. ఓ వీడియోని రిలీజ్ చేసింది.
శ్రుతి మాట్లాడుతూ.. నేను జీవితంలో చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాను. చాలా మంది నన్ను ఓదార్చేందుకు ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలో అన్నీ యూట్యూబ్ ఛానెల్స్ , మీడియా వారందరికీ దయతలచి చెప్తున్నాను.. నా భర్త గుండెపోటుతో చనిపోయిన విషయం మీకు తెలిసిందే. డాక్టర్లు కూడా వెల్లడించారు.
కానీ.. అసలు నిజం తెలియకుండా కొందరు ఆయన మరణంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు ఏమాత్రం పద్ధతి కాదు, ఇంట్లో అందరూ ఆవేదనలో ఉన్నాము. బాధతో కుమిలిపోతున్నాము.. ఒక మనిషిని కోల్పోయి ఉన్న మాపై.. పోయిన వ్యక్తిపై ఇలా మీ వ్యూస్ కోసం, లైకుల కోసం ఏది పడితే అది ప్రచారం చేయడం న్యాయం కాదు.. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఆవేదన వెలిబుచ్చింది శ్రుతి.
షణ్ముగప్రియ భర్త అరవింద్ గుండెపోటుతో చాలా చిన్న వయసులోనే చనిపోయారు.. అయితే ఈమధ్య గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అరవింద్ మరణంపై తమిళ మీడియాలో రకరకాల వార్తలు ప్రసారం అయ్యాయి. అతని అలవాట్లపై జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ఆయనకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటూ కొంతమంది తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.