Karthi : తెలుగు ఆడియెన్స్ పై కార్తీ కామెంట్స్.... తమిళ స్టార్ ఏమన్నారో తెలుసా?
తమిళ స్టార్ కార్తీ (Karthi) తెలుగు ప్రేక్షకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియెన్స్ తనకు సంబంధించిన వరకు ఇలాంటి వారు అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎంతలా ఇష్టపడుతారో తెలిసిందే. తమిళ హీరో అయినప్పటికీ కార్తీ తెలుగులో చాలా స్పష్టంగా, సరళంగా మాట్లాడగలరు. దాంతో ఇక్కడి వారితో సులువుగా కలిసిపోయారు.
అన్న సూర్య (Suriya) ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కార్తీ.. విభిన్న కథలు ఎంచుకుంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా ‘జపాన్’తో అలరించారు.
అయితే.. కార్తీ తెలుగు స్పీచ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటుంది. ఆయన మాట్లాడే తీరు అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇప్పటికే పలుమార్లు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారో చెప్పుకొచ్చారు. తాజాగా మరోమారు మన ఆడియెన్స్ పై తమిళ స్టార్ కార్తీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘మీకు తమిళ ఆడియెన్స్ ఇష్టమా? తెలుగు ఆడియెన్స్ ఇష్టమా?’ అని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.
‘నాకు కచ్చితంగా తెలుగు ప్రేక్షకులంటేనే ఇష్టం. ఎందుకంటే వారికి భాషాబేధాలు ఉండవు. నా ప్రతి సినిమాను వారు ప్రోత్సహించారు. ప్రతి సన్నివేశాన్ని వాళ్లు ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు వారు దొరకడం చాలా సంతోషంగా ఉంది.’ అంటూ తెలుగు ఆడియెన్స్ పై తన ప్రేమను కురిపించాడు.
ఇక కార్తీ ఒక్కరే కాదు... రజనీకాంత్, విక్రమ్, విజయ్ దళపతి, సూర్య, సిద్ధార్థ్, విశాల్, రాఘవా లారెన్స్, విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులు తమను ఆదరించే తీరును ఆకాశానికి ఎత్తారు. గతంలోనూ కార్తీ ‘తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించినంతగా తమిళ ప్రేక్షకులు ఆదరించలేదన్నారు’.