తమన్నా ప్రియుడు విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి. ఎలా కవర్ చేస్తున్నాడంటే..?
చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. తమన్నా - విజయ్ వర్మ. పెళ్ళెప్పుడంటే మాత్రం చెప్పడంలేదు. ఇద్దరు యాక్టర్స్ కావడంతో వీరి పెళ్లిపై సినిప్రేమికులలో క్యాూరియాసిటీ ఉంది. అయితే విజయ్ వర్మకు సబంధించిన ఓ న్యూస్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే..?
Image: Instagram
తమన్నా - విజయ్ వర్మ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న హీరోయిన్లు అందరు పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఇక వీరిపెళ్లి గురించి ఎదురు చూస్తున్నారు ప్యాన్స్. అయితే ఈలోపే విజయ్ తనకు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించాడు.
అందులో తనకు ఉన్న ఓ అరుధైన వ్యాధి గురించి చెప్పారు విజయ్. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన విజయ్ వర్మ తాను విటిలిగో అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానని అన్నాడు.
ఇది తెలుగులో బొల్లి పేరుతో పిలుస్తుంటారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని తెలుస్తోంది. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని కనిపించకుండా దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఈ వియంలో ముందు భయపడ్డాడటన విజయ్.
కాని ఆతరువాత సినిమాల్లో బిజీ అవ్వడం.. సక్సెస్ అయిన తరువాత అసలు ఈ విషయాన్ని ఆలోచించడం మానేశాను అన్నారు విజయ్ వర్మ. ఇక చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు తమన్నా భాటియా, విజయ్ వర్మ. ఈ విషయాన్ని ఇద్దరూ చాలా కాలం తరువాత బయటపడింది. అయితే ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నారు.
ఇక ఈ ఏడాది విజయ్, తమన్నా పెళ్ళి చేసుకోబోతున్నారన సమాచారం. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇక తమన్నా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ బ్యూటీ.. తెలుగులోసినిమాలు చేయడంలేదు. ఇక విజయ్ వర్మ గురించి చూసుకుంటే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన విజయ్ వర్మ.. బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యాడు.
Tamannah Bhatia
నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా మెప్పించిన విజయ్ వర్మ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్, గల్లీ బాయ్స్, డార్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో తన నటనతో బాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు విజయ్. అయితే సినిమాలు, వెబ్ సిరీస్ ల కంటే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగానే విజయ్ వర్మ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.