MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి వార్తలు, ట్రోల్స్ పై తమన్నా షాకింగ్‌ రియాక్షన్‌.. అప్పుడు డాక్టర్‌, ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌..

పెళ్లి వార్తలు, ట్రోల్స్ పై తమన్నా షాకింగ్‌ రియాక్షన్‌.. అప్పుడు డాక్టర్‌, ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌..

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ట్రీట్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చినా, ప్రమోషన్స్ లో పాల్గొన్నా అభిమానులకు పండగే. తాజాగా బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ట్రీట్‌తో అదరగొడుతుంది. మరోవైపు పెళ్లి వార్తలు, ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యిందీ పాలరాతి బొమ్మ.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 06 2022, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమన్నా(Tamanna) లేటెస్ట్ గా తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె బ్లూ కలర్‌ డ్రెస్‌ వేసి పరువాల విందు వడ్డించింది. పొట్టిదైన దుస్తుల్లో తన థైస్‌ అందాలతో కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ తో రచ్చ చేస్తుంది. నెటిజన్లని అలరిస్తుంది. సూపర్‌ హాట్‌ పోజులతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇదిలా ఉంటే ఇటీవల తమన్నా(Tamannaah Hot Photos) మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారిన విషయంతెలిసిందే. ముంబయికి చెందిన ఓ వ్యాపారిని ఆమె వివాహం చేసుకోబోతుందని, త్వరలోనే మ్యారేజ్‌ ఉండబోతుందనే వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై తమన్నా స్పందించింది. ఈ వార్తలపై ఆమె రియాక్షన్‌ ఆశ్చర్యపరిచేలా ఉండటం విశేషం. 
 

37

పెళ్లి రూమర్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలా సార్లు వచ్చాయి. అంతకు ముందు ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకుందన్నారు. మ్యారేజ్‌ కూడా సెట్‌ చేశారు. ఇప్పుడు బిజినెస్‌మ్యాన్‌తో మ్యారేజ్‌ అంటున్నారు. నటిగా మాకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. పూర్తిగా రూమర్స్. పెళ్లి విషయంలో హడావుడి లేదు. పేరెంట్స్ వైపు నుంచి కూడా ఫోర్స్ లేదు. నచ్చిన అబ్బాయి తారసపడినప్పుడు మ్యారేజ్‌ గురించి ఆలోచిస్తామని తెలిపింది. 

47

పెళ్లి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ గొప్ప మూవ్‌మెంట్‌. నా జీవితంలోనూ అది అందమైన భాగం. లవ్‌, పెళ్లి జీవితంలో బిగ్గెస్ట్ షోకేస్‌. ఆ విషయంలో తొందరపడటం లేదు. అయితే ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక విషయంలో తాను సంతోషంగా ఉన్నానని తమన్నా వెల్లడించింది. 
 

57

ఈ సందర్భంగా ట్రోల్స్, మీమ్స్ పైనూ ఆమె రియాక్ట్ అయ్యింది. తనపై వచ్చే విమర్శలను తాను పట్టించుకోను అని తెలిపింది. తాము పబ్లిక్‌ ఫిగర్స్. తాము అందరికి నచ్చాలని లేదు. రకరకాల కామెంట్లు వస్తుంటాయి. వాటిని అస్సలు పట్టించుకోను. అయితే వాటిని చూసి ఎంజాయ్‌ చేస్తాను. అంతేకానీ వాటిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోను అని స్పష్టం చేసింది తమన్నా. 

67

తమన్నా.. సత్యదేవ్‌తో కలిసి నటించిన `గుర్తుందా శీతాకాలం` (Gurtunda seetakalam) చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె మంగళవారం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇది రీమేక్‌ సినిమా అయినా, లవ్‌ స్టోరీ కొత్తగా ఉంటుంది. ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తాము ఆ ఫీల్‌ అయ్యామని, రేపు ఆడియెన్స్ కూడా అదే ఫీల్‌కి గురవుతారని వెల్లడించారు. గతంలో మాదిరిగా ఇందులో గ్లామరస్‌ డాన్సులు ఉండవని చెప్పింది. ఇరికించి వాటిని పెట్టలేమని, అలాంటి పాటలు ఇంతకు ముందే పెద్ద హీరోలతో చేశానని పేర్కొంది తమన్నా. 
 

77

తెలుగులో ప్రస్తుతం చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. జనవరిలో తాను షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ దిలీప్‌తో ఓ సినిమా చేస్తున్నానని పేర్కొంది. త్వరలోనే తన నుంచి మూడు ఓటీటీ ఫిల్మ్స్ విడుదల కాబోతున్నాయని పేర్కొంది. భాషలతో పనిలేదని, మంచి సినిమాలు ఎక్కడ వస్తే అక్క నటిస్తానని తెలిపింది. రెగ్యూలర్‌ మూవీస్‌ చేయాలనుకోవడం లేదని పేర్కొంది. కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించేవే చేస్తానని పేర్కొంది తమన్నా. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image3
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved