ఓదెల 2: హిందీ హక్కులు ఎంతకు అమ్మారో తెలిస్తే మతిపోతుంది!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇది పెద్ద రికార్డే. నార్త్ మార్కెట్ టార్గెట్ చేస్తూ నిర్మాతలు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ తక్కువే. ఉన్నంతలో ఓటిటి మార్కెట్ ని బేస్ చేసుకునే ఈ సినిమాలు రూపొందుతూంటాయి. అయితే సరైన ప్లాన్ చేస్తే నార్త్ మార్కెట్ కూడా టార్గెట్ చేయచ్చు. ముఖ్యంగా హనుమాన్, కార్తికేయ 2 తర్వాత హిందుత్వ లుక్ ఉన్న సినిమాలను నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహంగా ముందుకు తీసుకెల్తన్నారు. మంచి రేటు ఇస్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన నిర్మాతలు ఆ దిసగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఓదెల 2’సినిమాకు కూడా అలాంటి బిజినెస్ మ్యాజిక్ జరుగుతోందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన హిట్ మూవీ ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలో జరుగుతోంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది.
తమన్నాకు తెలుగులో తొలి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అయినప్పటికీ ‘ఓదెల 2’ హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమాకు పలికిన రేటు చిన్న సినిమాలలో అదీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో పెద్ద రికార్డే అంటున్నారు. " ‘ఓదెల 2’ను హిందీ డిస్ట్రిబ్యూటర్లు రూ. 9 కోట్లకు కొనుగోలు చేశారు ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ తెలుగు చిత్రానికి ఇది అత్యధికం" అని ఒక హిందీ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు, "ఆమె కొత్త గెపట్,. కొన్ని లుక్స్‌తో వారు నిజంగా ఆకట్టుకుంది. అదే ప్లస్ అయ్యిందని తెలుస్తోంది.
కాశీలో ప్రారంభమైన ఈ సీక్వెల్ చిత్రీకరణ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగింది. ఓదెల మల్లన్న ఆలయంతో పాటు గ్రామంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ తదితరులు షూట్‌లో పాల్గొంటున్నారు. తన కెరీర్‌లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది.
tamannah
ఇక తమన్నా తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె.. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.