- Home
- Entertainment
- Tollywood Heroines : బాలీవుడ్ మాయ.. కెరీర్ కోసం తమ రూల్స్ ను బ్రేక్ చేసిన హీరోయిన్లు.!
Tollywood Heroines : బాలీవుడ్ మాయ.. కెరీర్ కోసం తమ రూల్స్ ను బ్రేక్ చేసిన హీరోయిన్లు.!
టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కో ఇమేజ్ తో కెరీర్ లో పీక్స్ కు వెళ్లారు. స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అయితే కొన్నేళ్లుగా తాము పెట్టుకున్న రూల్స్ ను తామే బ్రేక్ చేస్తుండటం షాకింగ్ గా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) 18 ఏళ్లపాటు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కొన్నాళ్లుగా పెద్దగా హిట్లు లేకపోవడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ లో తన రూల్స్ ను బ్రేక్ చేసింది. పదేళ్లకుపైగా ముద్దు, బోల్డ్ సీన్లు, ఐటెం సాంగ్స్ కు దూరంగా ఉన్న మిల్క్ బ్యూటీ వాటిన్నింటిని బ్రేక్ చేస్తూ వచ్చింది. ‘లస్ట్ స్టోరీస్’, ‘జీ కర్దా’లో తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. కెరీర్ లో తమన్నా ఇలాంటి సంచలమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పటికీ షాకింగ్ గానే ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్ లో దుమ్ములేపుతోంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉంటారు. ప్రస్తుతం లీడింగ్ యాక్ట్రెస్ గా ఉంది. కాస్తా సినిమా గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే సాలిడ్ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో సామ్ కూడా ముద్దుసీన్లు, బోల్డ్ కంటెంట్ కు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ బాలీవుడ్ లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్ సిరీస్’తో బోల్డ్ సీన్ కు ఓకే చెప్పింది. ఆ తర్వాత ‘పుష్ప’లో ‘ఊ.. అంటావా మావ’ సాంగ్ తో సెన్సేషన్ గా మారింది.
తమిళ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) టాలీవుడ్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘నేను శైలజా’, ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. లాక్ డౌన్ ముందు వరకు తను చేసిన సినిమాలన్నీ చాలా పద్దతిగా ఉండేవి... ఆ క్రమంలో పెద్దగా సక్సెస్ రేట్ లేదు. దీంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ‘సర్కారు వారి పాట’లో టూ మచ్ గ్లామర షో చేసింది. సాంగ్స్ లో రెచ్చిపోయి స్టెప్పులేసింది. ఆ తర్వాత నుంచి ఫొటోషూట్లతోనూ నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన తొలిచిత్రం VD18లో నటిస్తోంది. ఇటు సౌత్ ఫిల్మ్స్ తోనూ బిజీగానే ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్లతో ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. కానీ తను కెరీర్ సరిగానే వెళ్తున్నా.. బాలీవుడ్ లో హిట్ కోసం ఏకంగా రన్బీర్ తో బోల్డ్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు రష్మిక మందన్న పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో హద్దులు దాటి నటించడం చర్చగా మారింది. దీంతో ఇన్నాళ్లు బోల్డ్ సీన్లకు తను పెట్టుకున్న రూల్ ను ‘యానిమల్’తో తుడిచేసింది.
ఎఫ్2తో నార్త్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) కూడా రీసెంట్ గా రూట్ మార్చేసింది. తను పాటిస్తూ వస్తున్న రూల్ ను బ్రేక్ చేసింది. బోల్డ్ సీన్ లో నటించి షాక్ ఇచ్చింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో పంజాబీ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఇన్నాళ్లూ పెద్ద తెరపై పద్దతిగా కిస్ సీన్స్ కు సైతం యస్ చెప్పని ఆమె కొద్దిగా హాట్ సీన్స్ చేసింది. రేప్ సీన్ లో నటించి ఆశ్చర్యపరించింది.
టాలీవుడ్ హ్యాట్రిక్ బ్యూటీ, మలయాళ ముద్దుగుమ్మ అనపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా కెరీర్ ప్రారంభం నుంచి పద్ధతిగా మెరుస్తూ వచ్చింది. ఆ మధ్యలో తన సినిమాలకు పెద్దగా సక్సెస్ లేకపోవడంతో రూటు మార్చింది. సంప్రదాయ నటనను బ్రేక్ చేసింది. 2021 తర్వాత రొమాన్స్ లో రెచ్చిపోతోంది. బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వకపోయినా.. తెలుగులో వచ్చిన ‘రౌడీ బాయ్స్’ మూవీలో ఫస్ట్ లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచింది. అలాగే ‘ఫ్రీడమ్ @ మిడ్ నైట్’లోనూ కాస్తా డేరింగ్ సబ్జెక్ట్ తో అలరించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.